NewsOrbit
జాతీయం న్యూస్

Big Breaking: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేము

Big Breaking: జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. జమ్మూకశ్మర్ కు ప్రత్యేక హోదాను కల్పిస్తూ 370 ఆర్టికల్ ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్ కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Supreme Court

వీటిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుండి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తన తీర్పును రిజర్వులో ఉంచిన ధర్మాసనం ఈ వేళ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకునే ప్రతి చర్యను సవాల్ చేయకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దు పై పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టి పారేయలేమని పేర్కొంది.

జమ్మూకశ్మీర్ భారత్ లో చేరినప్పుడు సార్వభౌమాధికరం లేదని చెప్పింది. అయితే రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ధర్మాసనంలోని అయిదుగురు న్యాయమూర్తులు .. మూడు తీర్పులు వెలువరించారు. భారత్ లో కశ్మీర్ విలీనమైనప్పుడు ప్రత్యేక హోదా లేవీ లేవని చెప్పింది. రెండు ఉద్దేశాల కోసమే ఆర్టికల్ 370 ఏర్పటైందన్నారు. నాటి ప్రత్యేక పరిస్థితులు, యుద్దంతో ఆర్టికల్ 370 తీసుకొచ్చారని సీజేఐ పేర్కొన్నారు. కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం కేవలం వెసులుబాటు మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

మరో పక్క సుప్రీం తీర్పు ఎలా ఉన్న గౌరవించాల్సిందేనని బీజేపీ పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కశ్మీర్ లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని పది జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహించారు. ప్రజలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసులు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

జమ్మూ కశ్మీర్ నుండి లడ్దాక్ ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సైతం సుప్రీం కోర్టు సమర్ధించింది. అయితే, ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్దరించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30వ తేదీ లోగా జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా జమ్మూకశ్మీర్ లో శాంతి భద్రతలకు తమ పార్టీ ఎటువంటి విఘాతం కలిగించబోదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్ ఇప్పటికే స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితి ఏదురైతే న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్దమైందని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తున్న ఆశాభావంలో అక్కడి పార్టీలు ఉన్నాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో అక్కడి పార్టీల నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Revanth Reddy: త్వరలో కేబినేట్ విస్తరణ ..? ఆ ముగ్గురికి బెర్త్ కన్ఫర్మ్ ..??

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?