NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: 21 మంది అభ్యర్ధులతో జనసేన ఫస్ట్ లిస్ట్..?? సోషల్ మీడియాలో వైరల్

Janasena: రాష్ట్రంలో టీడీపీ – జనసేన పొత్తు ఫిక్స్ అయ్యింది. నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏయే స్థానాల్లో అభ్యర్ధులు నిలపాలనే దానిపై జనసేన కసరత్తు చేస్తొంది. జనసేన ఓటు బ్యాంక్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తప్పనిసరిగా అభ్యర్ధులను నిలపాలన్న భావనతో ఇన్ చార్జిలను నియమిస్తొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు మూడు సార్లు భేటీలు అయ్యారు. అయితే ఇప్పటి వరకూ పొత్తులో భాగంగా జనసేన ఏయే స్థానాల్లో పోటీ చేయనున్నది అనేది ఇంకా బహిరంగంగా వెల్లడించలేదు.

సీట్ల సర్దుబాటుపై ఇంత వరకూ ఫైనల్ చర్చలు జరగలేదు. అయితే గతంలో జనసేన, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల శాతం, బలమైన నేతలను ఇన్ చార్జిలుగా నియమించిన స్థానాలను బట్టి పలు స్థానాలపై ఊహాగానాలు వస్తున్నాయి. జనసేన సోషల్ మీడియాలో 21 మంది అభ్యర్ధులతో తొలి జాబితా సిద్దమైందన్న ప్రచారం జరుగుతోంది. తొలి జాబితాలో దాదాపు ఒక్క సీటు కూడా కోల్పోయే పరిస్థితి ఉండదని కూడా వారు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ 21 అసెంబ్లీ స్థానాలు ఏమిటి.. అభ్యర్ధులు ఎవరు అనేది ఒక సారి పరిశీలన చేస్తే..

Pawan Kalyan is stuck in the matter of collecting Janasena donations
Pawan Kalyan
  • నెలిమర్ల – లోకం నాగ మాధవి
  • గజపతినగరం – పడాల అరుణ
  • గాజువాక – సుందరపు సతీష్
  • భీమిలి – పంచకర్ల సందీప్
  • పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు
  • యలమంచిలి – సుందరపు విజయకుమార్
  • ముమ్మడివరం – పితాని బాలకృష్ణ
  • రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
  • రాజమండ్రి రూరల్ – కందుల దుర్గేష్
  • కాకినాడ రూరల్ – పంతం నానాజీ
  • పిఠాపురం – ఉదయ్ శ్రీనివాస్
  • రామచంద్రాపురం – చిక్కం దొరబాబు
  • జగ్గంపేట – పతంశెట్టి సూర్యచంద్రరావు
  • రాజోలు – డీఎంఆర్ శేఖర్
  • భీమవరం – పవన్ కళ్యాణ్
  • తణుకు – విదవాడ రామచంద్రరావు
  • తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
  • నరసరాపురం – బొమ్మిడి నాయకర్
  • విజయవాడ వెస్ట్ – పోతిన మహేష్
  • తెనాలి – నాదెండ్ల మనోహర్
  • గిద్దలూరు – ఆమంచి శ్రీనివాస రావు (సోములు)

సోషల్ మీడియాలో జనసేన మొదటి జాబితాలో అభ్యర్ధులు వీరు అన్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వెల్లడవుతున్న ఈ జాబితాలో దాదాపు ఒకటి రెండు మినహా దాదాపు జనసేన పోటీ చేసే స్థానాలే అన్న మాట వినబడుతోంది. ప్రస్తుతం ఈ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడాలి ఏమి జరుగుతుందో..!

YS Jagan: నేడు సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన .. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే..?

Related posts

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N