Sekhar Kammula Prabhas: తెలుగు చలనచిత్ర రంగంలో క్లాస్ దర్శకుడిగా శేఖర్ కమ్ములకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అంతేకాదు ఎంతోమంది నూతన నటీనటులను తెలుగు సినిమా రంగానికి అందించిన డైరెక్టర్ గా కూడా పేరు ఉంది. వరుణ్ సందేశ్, రానా, నిఖిల్, తమన్నా, కమలిని ముఖర్జీ.. ఇలా చాలామందిని నటీనటులుగా పరిచయం చేశారు. చాలావరకు క్లాస్ సబ్జెక్టులను ఎంచుకుని.. అద్భుతమైన విజయాలను శేఖర్ కమ్ముల అందుకోవటం జరిగింది. అయితే తాను క్లాస్ సినిమాలు చేసిన గాని వ్యక్తిగతంగా మాత్రం మాస్ సినిమాలనే ఎక్కువ ఇష్టపడతానని చాలా సందర్భాలలో ఆయన తెలియజేయడం జరిగింది.
అంతేకాదు మెగాస్టార్ చిరంజీవికి.. తాను పెద్ద అభిమానిని ఆయన డాన్స్, యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి ఫిదా అయినట్లు కూడా తెలిపారు. అటువంటి ఈ క్లాస్ దర్శకుడు తాజాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ పొగడ్తలతో ముంచుతారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ రియల్ హీరో. టాలీవుడ్ లో చాలామంది హీరోలు..విలన్స్ తో పోరాటాలు చేసే సన్నివేశాలు చూస్తే రియాల్టీగా అనిపించవు. కానీ ప్రభాస్ ఫైట్ సన్నివేశాలు.. రియాల్టీగా ఉంటాయి. శేఖర్ కమ్ముల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో.. వైరల్ గా మారాయి. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సలార్ మొదటి భాగం టికెట్లు హాట్ కేకు లాగా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్.. మరియు ట్రైలర్ యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్… ప్రభాస్ నీ చాలా వైలెంట్ గా చూపించడం జరిగింది. ఇటీవలే సలార్ సినిమా మొదటి భాగం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ అందించారు. ఇంకా విడుదలకు పది రోజులు మాత్రమే టైం ఉండటంతో సినిమాలో సాంగ్స్ కూడా ఒక్కొక్కటి విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.