NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 13 2023 Episode 1124: షాపింగ్ పేరు చెప్పి ఆర్య ని ఇబ్బంది పెడుతున్న హరీష్..

Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights

Prema Entha Madhuram December 13 2023 Episode 1124: ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను షాపింగ్ లో నాకు మాట రాకూడదు నీ కొడుకు ఏం చేస్తాడో ఏమో అని దివ్య అంటుంది. ఇప్పటికిప్పుడు షాపింగ్ అంటే డబ్బులు ఎక్కడ ఉంటాయి ఆలోచించుకోవాలి కదా అని సుగుణ అంటుంది. ఒప్పుకున్నాడుగా నీ కొడుకు ఏం చేస్తాడు డబ్బులు రెడీ చేస్తాడు అని జ్యోతి అంటుంది. మనమందరం షాపింగ్ కి వెళ్తున్నాం రెడీ అవ్వండి అని ఆర్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఆర్య జెండి ని కలవడానికి వెళ్తాడు. ఇదేంటి జెండి 50 లక్షల చెక్కు దేనికి అని అడుగుతాడు ఆర్య. నీకోసమే ఆర్య 50 లక్షల కట్నం అడిగారంట కదా పెళ్లి వాళ్ళు 5 10 లక్షల అయితే నీరజ్ సార్ సంతకం సరిపోతుంది కానీ పెద్ద మొత్తంలో డబ్బు కదా అని  జెండి అంటాడు. డబ్బు ఇచ్చి నేను పెళ్లి చేయాలి అనుకుంటే ఆ ఇంటికి సూర్యాగా వెళ్లే వాడిని కాదు జెండి సూర్య గా నేను అక్కడ ఉండి వాళ్ళ కొడుకు సంపాదించిన డబ్బుతోనే పెళ్లి చేయాలి అని ఆర్య అంటాడు. ఈ పెళ్లి పేరు అడ్డం పెట్టుకొని ఎవరో కావాలని నిన్ను టార్చర్ చేస్తున్నారు అనుకుంటా అయినా ఇంత తక్కువ టైంలో అంత డబ్బు నీకు కావాలంటే ఏదైనా మిరాకిల్ జరగాలి  ఆర్య అని జెండి అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights
Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights

చూద్దాం జెండి ఈ పెళ్లిలోపు ఏదో ఒక మిరాకిల్ జరగకపోతుందా అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, ఆర్య డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఆర్య అలా బాధపడుతుంటే తనను చూసి బాధపడుతుంది అను. ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు ఎవరో కావాలనే ఇలా ప్లాన్ చేశారనుకుంటా సార్ కానీ మీరేంటి సార్ మా బామ్మర్ది ప్లేస్ లో ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు యాదగిరి. చూడు యాదగిరి నా సంపాదనతోటే నేను దివ్య పెళ్లి చేస్తాను నా పలుకుబడిని ఉపయోగించను ఇంతకంటే నీకు ఇంకేమి చెప్పలేను అని ఆర్య అంటాడు. అను కిచెన్ లోకి వెళ్తుంది. ఆర్య కి దాహం వేసి మంచినీళ్లు తాగుదామని కిచెన్ లోకి వెళ్తాడు. సార్ మీరు ఎక్కడికి సార్ మీరు కూర్చోండి నేను మంచినీళ్లు తీసుకొస్తాను అని యాదగిరి అంటాడు. చూడు యాదగిరి నువ్వు నాకు ఇంత మర్యాద ఇస్తే ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది నీ హద్దులో నువ్వుండు అని ఆర్య అంటాడు. సార్ మీరు అక్కడ కూర్చోండి సార్ నేను మంచినీళ్లు తీసుకువస్తాను అని అడ్డం తిరుగుతాడు యాదగిరి.

Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights
Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights

చూడు యాదగిరి ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అని ఆర్య యాదగిరి నెట్టేసి వెళ్తూ ఉంటాడు. అను మేడం కిచెన్లో ఉంది ఇప్పుడు సార్ వెళ్తే చూసేస్తారు ఎలా ఆపాలి అని గట్టిగా మీరు కిచెన్ లోకి ఎందుకు సార్ నేను మంచినీళ్లు తెస్తాను అని అరుస్తాడు యాదగిరి. ఆ మాటలు విని అను మొహానికి టవల్ కట్టుకొని ఆర్య వచ్చేలోపు బూజు దులుపుతూ ఉంటుంది. ఆర్య లోపలికి వెళ్లి మంచినీళ్లు తాగుతాడు. అను బూజు దులుపుతూ కింద పడిపోతే ఆర్య పట్టుకుంటాడు. తన కళ్ళలోకి సూటిగా చూడలేక ఆర్య నేలకేసి చూస్తాడు. ఆర్య కళ్ళలోకి అను సూటిగా చూస్తుంది. అలా కొద్దిసేపు అలాగే ఆర్య చూస్తూ ఉంటాడు. ఇంతలో యాదగిరి వచ్చి అరెరే పడిపోయవనీకెందుకమ్మా ఈ పనులన్నీ నేను చేస్తాను నువ్వు వెళ్ళు అని బూజు కర్ర తీసుకుంటాడు యాదగిరి.అను వెళ్లిపోతుంటే ఆర్య  అలా చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని యాదగిరి అడుగుతాడు. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అని ఆర్య అంటాడు. అమ్మో సార్ మేడని చూసినట్టున్నాడే అని  నా కళ్ళు లేదు పడింది చూడు సార్ అని యాదగిరి అంటాడు. యాదగిరి చెంప మీద చెడేళ్ల మని ఒకటి ఇచ్చి వెళ్ళిపోతాడు ఆర్య. కట్ చేస్తే, దివ్య మేమందరం షాపింగ్ మాల్ వచ్చేసాం మీరు బయలుదేరారా అని హరీష్ ఫోన్ చేస్తాడు.

Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights
Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights

ఇప్పటికిప్పుడు షాపింగ్ చేయాలంటే మాకు డబ్బులు సర్దుబాటు కావాలి కదా వచ్చేస్తున్నాను హరీష్ అని దివ్య అంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు మాత్రం ఎందుకు ఉంటుంది దివ్య అర్థం చేసుకో అని హరీష్ అంటాడు. అమ్మ హరీష్ వాళ్ళు షాపింగ్ మాల్ వెళ్ళారంట త్వరగా రండి వెళ్దాం అని అంటుంది. షాపింగ్ అనగానే అలాగే వచ్చేస్తారా డబ్బులు కావాలి కదా అని సుగుణ అంటుంది. నీ కొడుకు ఏర్పాటు చేస్తానన్నాడు కదా అని దివ్య అంటుంది. అవన్నీ ఆయన గారు చూసుకుంటాడు మనం షాపింగ్ కి వెళ్దాం పదండి అని జ్యోతి అంటుంది. వాళ్లందరూ ఆటో దగ్గరికి వెళ్తారు. అయ్యో ఉష నేను రాధాని పిలవడం మర్చిపోయాను వెళ్లి తీసుకురా అమ్మ అని సుగుణ అంటుంది. ఇప్పుడు ఆర్య సార్ కూడా వస్తాడు మేడం ని చూస్తాడు ఎలా అని కవర్ చేయడానికి ఇప్పుడు ఆవిడ ఎందుకులే అత్తయ్య మనకు ఆటోలు సరిపోవు అని యాదగిరి అంటాడు. మేము ఎలాగో అలా సర్దుబాటు చేసుకుంటాంలే బావ అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights
Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights

ఇదొక్కతి ప్రతి దాంట్లోకి దూరిపోతుంది అని యాదగిరి అనుకుంటాడు. ఉషా వెళ్లి అనుని తీసుకొని వస్తుంది.ఈ ఆటోలో కూర్చో మా అని యాదగిరి అంటాడు. ఏం అక్కర్లేదు మా దగ్గరే కూర్చుంటుంది అని ఉషా తీసుకువెళ్లి తన పక్కన కూర్చోపెట్టుకుంటుంది. సూర్య త్వరగా రా నాన్న లేట్ అయిపోతుంది అని సుగుణ పిలుస్తుంది. వస్తున్నానమ్మా అని ఆర్య వస్తాడు. బావ నువ్వు ఈ ఆటోల కూర్చో నేను ఆ ఆటో ముందు కూర్చొని డ్రైవర్ కి అడ్రస్ చెప్తాను అని యాదగిరి అంటాడు. ఏం పర్వాలేదు అని ఆర్య వెళ్లి అను కూర్చున్న ఆటోలో కూర్చుంటాడు. యాదగిరి మేడంని ఎక్కడ చూస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే, అందరూ షాపింగ్ మాల్ కి వచ్చేస్తారు.

Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights
Prema Entha Madhuram Today Episode December 13 2023 Episode 1124 Highlights

సుగుణ పెళ్లి వాళ్ళకి వాళ్ల పిల్లల్ని పరిచయం చేస్తుంది. వదిన గారు కాస్ట్లీ చీరలు పైన ఉన్నాయి అంటారండి వెళ్దాం అని వాళ్ళవియపురాలు పిలుస్తుంది. మీరు వెళ్ళండి నేను వస్తాను అని సుగుణ అంటుంది. ఆర్య అనుని చూడకుండా యాదగిరి కవర్ చేస్తాడు.ఏంటి సూర్య వీళ్లు కాస్ట్లీ చీరలు అంటున్నారు బిల్లు ఎంత అవుతుందో ఏమో అని సుగుణ భయపడుతుంది. అవును సార్ ఎందుకు వచ్చినా తలనొప్పి వీళ్లంతా కావాలనే చేస్తున్నారు అనుకుంటా పుణ్యానికి వస్తే అన్ని తీసుకొని వెళ్ళిపోయేలా ఉన్నారు అని యాదగిరి అంటాడు. మీరు వెళ్లి షాపింగ్ చేయండి అమ్మ నేను ఏదో ఒకటి చేస్తాను అని ఆర్య అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri