NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: శాసనసభలో వాడివేడిగా చర్చ .. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

Telangana Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమైయ్యాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించగా, ఇవేళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. తొలుత శాసనసభలో ఈ తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి బలపరిచారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించగా, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరిచారు.

తొలుత ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసిఆర్ పేరును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ ..అలిశెట్టి ప్రభాకర్ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై కేటిఆర్ విమర్శలు చేశారు. కేటిఆర్ విమర్శలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం తిప్పికొట్టారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ మాట్లాడతామని కేటిఆర్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా .. విపక్షంలో ఉన్నా తాము ప్రజా పక్షమేనని అన్నారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడక..అన్నీ అసత్యాలే అని అన్నారు.

కాంగ్రెస్ హయంలో ఉపాది లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారన్నారు. ఇందిరమ్మ పాలన అంటే అన్నీ గుర్తు చేయాలన్నారు. మొదటి రోజు సభలోనే ప్రభుత్వంపై దాడి చేస్తారా అంటూ భట్టి ప్రశ్నించారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటామని అన్నారు. ఉమ్మడి పాలన నచ్చకే కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని భట్టి అన్నారు. సంపదతో కూడిన తెలంగాణను విధ్వంసం చేశారని అన్నారు.

కేటిఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సభ్యులసంఖ్య ముఖ్యం కాదనీ, ప్రజా స్వామ్య స్పూర్తి ఉండాలన్నారు. కేసిఆర్ కు రాజకీయ జీవితం ప్రసాదించిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చింది. కేంద్రంలో మంత్రి కేసిఆర్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. కేకే మహేందర్ రెడ్డి సీటు గుంజుకుని కేటిఆర్ సిరిసిల్ల  ఎమ్మెల్యే అయ్యారంటూ రేవంత్ విమర్శించారు. ఇలా విమర్శలు, ప్రతి విమర్శలతో సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగుతోంది.

Amrapali: తెలంగాణ సర్కార్ లో ఆంధ్రా ఆడపడుచుకు కీలక బాధ్యతలు

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju