NewsOrbit
జాతీయం న్యూస్

Covid -19 Sub Variant JN.1: పెరుగుతున్న కరోనా కేసులు .. ముగ్గురు మృతి .. ఆందోళన అవసరం లేదు కానీ..

Covid -19 Sub Variant JN.1: కొవిడ్ -19 కొత్త వేరియంట్ జేఎన్ 1 వేరియంట్ ప్రబలడంతో దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 614 కేసులు, మూడు మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. మే 21 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది. దేశ వ్యాప్త కోవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

తాజా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మందులు, ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్ లు, వాక్సిన్ల కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ విషయంలో కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించే నకిలీ సమాచార వ్యాప్తిని అడ్డుకోవాలని, రియల్ టైమ్ లో కేసుల సంఖ్య, పరీక్షల వివరాలు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు కోవిడ్ పోర్టల్ లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ లు నిర్వహించాలని పేర్కొన్నారు.

జేఎన్ 1 వేరియంట్ సోకిన వారిలో 91 నుండి 92 శాతం మంది ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య) డాక్టర్ వికే పాల్ తెలిపారు. కొత్త జేఎన్ 1 ఉప రకాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ .. దీంతో ప్రజారోగ్యానికి ప్రమాదం తక్కువేనని పేర్కొంది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇక తెలంగాణలో బుధవారం ఆరు కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ వెల్లడించారు. కరోనా సోకిన ఆరుగురూ హైదరాబాద్ కు చెందిన వారే. రాష్ట్రంలో ఒకరు వైరస్ నుండి కోలుకున్నారు. ఏపీలో కొత్తగా కరోనా కేసులు ఏవీ నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో జనం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, సమూహాల్లో సంచరిస్తున్నప్పుడు మాత్రం మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.

Aravind Kejriwal: ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా

Related posts

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju