NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

JD Lakshmi Narayana: ప్రాంతీయ పార్టీలపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

JD Lakshmi Narayana key comments on regional parties

JD Lakshmi Narayana: జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ప్రాంతీయ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని జై భారత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు . రాజకీయాల్లో వ్యక్తి పూజ ఉంటే అది రాచరికానికి దారి తీస్తుందని, ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో వ్యక్తి పూజే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం మంచిదని అన్నారు.

ఈ సందర్భంలో అంబేద్కర్ చెప్పిన ఓ విషయాన్ని గుర్తు చేశారు. నా విగ్రహాల కన్నా .. నా పుస్తకాల ద్వారా నన్ను గుర్తించండి అని అంబేద్కర్ చెప్పారని అన్నారు. రాజ్యాంగం చాలా గొప్పదే అయినా అధికారంలో ఉన్న పార్టీ రాజ్యాంగాన్ని సక్రమంగా ఉపయోగించకపోతే అది వృధానే అవుతుందని అన్నారు. ప్రజలు కూడా రాజ్యాంగాన్ని మంచిగా అమలు చేసే వారినే ఎన్నికల్లో ఎన్నుకోవాలని అన్నారు.

ఏపీలో బీజేపీని ఎప్పుడో ఓడించారని అన్నారు. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం ప్రజాభిప్రాయానికి భిన్నంగా బీజేపీతో అంటకాగుతున్నాయని విమర్శించారు. గతంలో జయప్రకాష్ నారాయణ తరహాలో ఇప్పుడు వడ్డే శోభనాదీశ్వరరావు అందరినీ ఏకం చేస్తున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీలకు నాలుగు సార్లు కేంద్రాన్ని నిలదీసే అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదని, పైగా వారి స్వార్ధం కోసం కేంద్రం కాళ్ల మీద పడిన సందర్భాలు చూశామని అన్నారు.

ప్రత్యేక హోదా కు  ప్రాంతీయ పార్టీలు ముగింపు పలికాయని అన్నారు. ఆ పార్టీలే ఇప్పుడు ముగిసిన అధ్యాయం అంటున్నాయన్నారు. ఎన్నికల్లో ప్రత్యేక హోదా స్లోగన్ కాదని ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి సాధించుకోవాలని అన్నారు. సంఘటిత శక్తి గా ఎదిగే పోరాటంలో జై భారత్ పార్టీ భాగస్వామ్యం గా ఉంటుందని అన్నారు. నల్ల చట్టాలు, జల్లి కట్టు పోరాట ల స్పూర్తి తో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ అన్నారు.

Atal Setu: ప్రధాని మోడీ ప్రారంభించిన అటల్ సేతు ..అతిపొడవైన ఈ సముద్రపు వంతెన ప్రత్యేకతలు ఇవి..

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju