NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami january 12 2024 Episode 251: నాగమణిని తీసుకు వచ్చిన పంచమి, పంచమి నాగమణి నాకిస్తే తప్ప మోక్షా నీకు కనపడడు అంటున్న మేఘన..

Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights

Naga Panchami january 12 2024 Episode 251: పంచమి పూర్తిగా నాగినిగా మారిపోయే నాగలోకంలో అడుగుపెడుతుంది.ఇదే యువరాణి నాగ లోకం ఎలా ఉంది అని ఫణీంద్ర అంటాడు.నా కళ్ళకి మోక్ష బాబు తప్ప ఇంకేమీ కనపడట్లేదు ఫణీంద్ర అని పంచమి అంటుంది.ఇప్పుడు అందరూ విశ్రమించే సమయం యువరాణి ఇప్పుడైతేనే నాగదేవతకు తెలియకుండా నాగమణిని తీసుకు వెళ్లొచ్చు లేదంటే నాగదేవతకు తెలిసిపోయి ఘోరమైన శాపానికి గురైతం మనం తొందరగా పని ముగించుకొని వెళ్దాం అని ఫణీంద్ర అంటాడు.అలాగే యువరాజా ఎటు వెళ్ళాలి అని పంచమి అడుగుతుంది. అలాగే యువరాణి తీసుకువెళ్తాను అని ఫణీంద్ర నాగమణి ఉన్న చోటికి తీసుకు వెళ్తాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights
Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights

ఇదే యువరాణి నాగమణి ఉండే స్థలం అదిగో కనిపించే  ఐదు పడగల పైన నాగమణి ఉంది చూడు తొందరగా కానీ పంచమి వెళ్ళిపోదాం లేదంటే నాగదేవతకు దొరికిపోతాం అని ఫణీంద్ర అంటాడు. నాగులోకపు యువరానికి తప్ప ఆ నాగమణిని ముట్టుకుని అర్హత ఇంకెవరికీ లేదు భయపడకు నిన్ను ఆ పాము ఏమి చెయ్యదు వెళ్లి త్వరగా నాగమణిని తీసుకురా అని ఫణీంద్ర అంటాడు. పంచమి నాగమణిని చూసి ఆనందిస్తుంది. పంచమి నాగదేవత కి నమస్కారం పెడుతూ నాగదేవత నన్ను క్షమించండి తప్పుని తెలిసినా తప్పక చేస్తున్నాను నా భర్తను కాపాడుకోవాలంటే ఈ నాగమణి నేను ఎవరికీ తెలియకుండా దొంగలించాలి నా మాంగల్యాన్ని కాపాడుకోవడానికి ఈ పనిని చేస్తున్నాను నన్ను క్షమించండి అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights
Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights

నాకు ఇంతకన్నా వేరే మార్గం కనిపించట్లేదు నాగదేవత మోక్ష బాబు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు తనను నేను ఎలాగైనా కాపాడాలి అంటే ఈ నాగమణిని తీసుకువెళ్తేనే మోక్ష బాబు ప్రాణాలు కాపాడగలరు అని నాగదేవతకు ప్రాణామాలు చేసి పంచమి తన గుండెలోని బాధంతా చెప్తుంది. పంచమి అలా ప్రార్థించి చెయ్యి చాపగానే నాగదేవత కరుణించి నాగమణి తన చేతిలో పెడుతుంది. నాగమణి తన చేతిలోకి తీసుకొని పంచమి సంతోషిస్తుంది.ఫణీంద్ర అది చూసి ఆశ్చర్యపోతాడు. యువరాణి పద మనం ఇక వెళ్ళిపోతాం ఎవరైనా చూస్తే ప్రమాదం అని ఫణీంద్ర అంటాడు. వాళ్లు అల్లా అక్కడి నుంచి బయలుదేరుతారు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights
Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights

నాగ సాధువు పసర్లు రుద్దుతూ మోక్ష దేహని కాపాడుతూ ఉంటాడు. ఇంతలో మేఘన అక్కడికి వచ్చి మోక్ష శ్వాస ఆడుతుందా లేదా చూసి మోక్ష చనిపోయాడు అని చెప్తుంది. నాగ సాధువు కూడా తన చేయి పట్టుకుని చూసి ఏం పరవాలేదు ఈలోగా పంచమి వస్తుంది కదా అని అంటాడు. ఇతను ఇక్కడే ఉంటే మోక్ష దేహాన్ని నేను మాయం చేయలేను అప్పుడు నాగమణి నా సొంతం కాదు అని మేఘన నాగ సాధువును పిలిచి మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి పంచమి వచ్చేవరకు మోక్ష దేహాన్ని నేను కాపాడుతాను అని అంటుంది. నాకు ఇంతకంటే ముఖ్యమైన పని ఏమీ లేదు అని నాగ సాధువు అంటాడు. మేఘన వెంటనే తన మాయ శక్తితో తనని మూర్చపోయేలా చేస్తుంది. నాగ సాధువు కింద పడిపోగానే మోక్షని తన మంత్ర శక్తితో కనపడకుండా చేస్తుంది. మీరు ఇక్కడే ఉంటారు మోక్ష కానీ ఎవరికీ కనపడరు నేను నాగమణి సొంతం చేసుకోవాలంటే మిమ్మల్ని ఇలా కనపడకుండా చేయక తప్పలేదు అని మేఘన అంటుంది. ఈరోజు ఎలాగైనా ఆ నాగమణి నా సొంతం చేసుకొని మా అన్నను కాపాడుకోవాలి అని మేఘన ఆనందిస్తుంది.కట్ చేస్తే.

Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights
Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights

ఇంతలో పంచమి నాగమణి తీసుకుని అక్కడికి వస్తుంది. మోక్ష ఎక్కడ మేఘన అని పంచమి అడుగుతుంది. మేఘన కాదు పంచమి ఖరాలి అని మేఘన అంటుంది. నీ పక్కనే బల్లెం లా ఉండి నిన్ను నమ్మించి నీ వెంట తిరిగాను కానీ నువ్వు నన్ను గుర్తు పట్టలేక పోయావు అని మేఘన అంటుంది.అంటే నువ్వు నిజంగా నాగ కన్యవి కాదా నన్ను మోసం చేసి నా వెంట తిరిగి నాగ కన్యనని నేను నమ్మించావా అని ఫణీంద్ర అంటాడు. ఇప్పుడు సమయం లేదు మేఘన మోక్ష బాబు ఎక్కడ ఉన్నాడో చెప్పు బ్రతికించాలి అని పంచమి అంటుంది. నువ్వు నాగమణి నాకు ఇస్తే తప్ప మోక్ష నీ కంటికి కనబడడు లేదంటే తన శరీరం పురుగులు పట్టి భూమి పాలు అయిపోతుంది అని మేఘన బెదిరిస్తుంది.  నీకు వేరే గచ్చంత్రం లేదు పంచమి నాగమణి నాకు ఇస్తే మా అన్న నంబూద్రి ని  కాపాడిన తరువాత మోక్షని కాపాడుతాను లేదంటే నీ మోక్ష చచ్చిపోతాడు అని మేఘన అంటుంది. మేఘన నేను ఇంత కష్టపడి తేచ్చింది మోక్ష బాబు ప్రాణాలు కాపాడడానికి దయచేసి నా భర్త ఎక్కడ ఉన్నాడు చెప్పు అని పంచమి బ్రతిమలాడుతుంది.

Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights
Naga Panchami Today Episode January 12 2024 Episode 251 Highlights

లేదు పంచమి నువ్వు నాగమణి నా చేతిలో పెడితే తప్ప నీ మోక్ష నీకు కనిపించడు అని మేఘన తెగేసి చెప్తుంది. పంచమి చేసేది ఏమీ లేక నాగమణిని తీసి తన చేతిలో పెడుతుంది. అన్నా నంబూద్రి వస్తున్నాను అన్న ఇక నీవు జీవం పోసుకొని మళ్ళీ ఈ భూమి మీద తిరుగుతావు అని సంతోష పడిపోతూ మేఘన వెళ్తుంది. పంచమి ఫణీంద్ర ఆశ్చర్యపోయి అలాగే నిలబడి చూస్తూ ఉంటారు.అలా కొద్ది దూరం అడవిలోకి వెళ్ళగానే తెల్లవారుతుంది తనకు మెలకువ వస్తుంది ఇదేంటి ఇదంతా కల అని అడివినంతా  తీరుపారీ ఒక్కసారి చుట్టూ చూస్తుంది. నిజంగానే ఇదంతా కలే మోక్షాకి పంచమికి డౌట్ వచ్చేలోగా వాళ్ళని తొందర పెట్టాలి అని మేఘన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,పంచమి మోక్ష ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. నాగ సాధువు వచ్చి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు నాగ చంద్రకాంత మొక్కని ఎవరు తెస్తారు అని నాగ సాధువు అడుగుతాడు..

Related posts

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri