Guntur Kaaram: తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో ఓవర్సీస్ లో అత్యధిక మార్కెట్ కలిగిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటించిన ఎలాంటి సినిమా అయినా విదేశాలలో భారీగా కలెక్షన్స్ సాధిస్తాయి. ఇది అదే విధంగా తెలుగు దర్శకులలో ఓవర్సీస్ లో త్రివిక్రమ్ కి అత్యధిక మార్కెట్ ఉంది. దీంతో వీరిద్దరి కలయికలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తారీకు “గుంటూరు కారం” విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్ మరియు పాటలు సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేయడం జరిగింది. అయితే సినిమా విడుదల అయ్యాక మిక్సిడ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు.
ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. మహేష్ కుటుంబ సభ్యులు మరణించడంతోపాటు ప్రాజెక్టు నుండి పూజ హెగ్డే అర్ధాంతరంగా మధ్యలోనే వదిలేసుకోవడం జరిగింది. కొంతమంది టెక్నికల్ వర్క్ చేసే వాళ్ళు కూడా సినిమా ప్రాజెక్టు నుండి మధ్యలోనే ఆగిపోయారు. 2022 ఫిబ్రవరి నెలలో పూజా కార్యక్రమాలు మొదలుకాక అదే ఏడాది అక్టోబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత మహేష్ బాబు నటించిన సినిమా ధియేటర్లలో నేడు విడుదల కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున ఓపెనింగ్స్ వచ్చాయి. పైగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా కావటంతో ఊహించని దానికంటే.. ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాయి. అర్ధరాత్రి నుంచి ప్రీమియర్స్ వేయడంతో అభిమానులు థియేటర్లలో సందడి చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే విదేశాలలో సత్తా చాటి మహేష్ బాబు “గుంటూరు కారం”తో కూడా సరికొత్త రికార్డు సెట్ చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే అమెరికాలో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ అత్యధికంగా అందుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అమెరికాలో మహేష్ 11 సినిమాలు వరుసగా వన్ మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోవటం జరిగింది. తాజాగా గుంటూరు కారం కూడా మొదటి రోజే నెంబర్ అందుకోవటంతో పన్నెండు ఒకసారి రికార్డు సృష్టించాడు. గుంటూరు కారం సినిమాకి అమెరికాలో ప్రీమియర్స్ భారీ స్థాయిలో పడ్డాయి. దీంతో మొదటి రోజు హాఫ్ డేలో ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించడం జరిగింది. అమెరికాలో వరుసగా 12 సినిమాలతో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ అత్యధిక సార్లు అందుకున్న హీరోగా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. తారక్ నటించిన 9 సినిమాలు అమెరికాలో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ అందుకోవటం జరిగింది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!