NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభ వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసిన వైఎస్ జగన్ .. ఆ నేతలు వీళ్లే..

YSRCP: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. రాజ్యసభ బరిలోకి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాథరెడ్డి పేర్లను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు.

ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలు తామే దక్కించుకునేలా వైసీపీ చర్యలు తీసుకుంటోంది. త్వరలో మాక్ పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. కాగా, ఈ రోజు నుండి 15వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే ఈ నెల 12వ తేదీన వైసీపీ ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 27వ తేదీన మూడు రాజ్యసభ రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ కూడా అదే రోజు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి లు కృతజ్ఞతలు తలిపారు. ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను సీఎం జగన్ అబినంధించారు.

వైవీ సుబ్బారెడ్డికి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సిట్టింగ్ స్థానాన్ని వదులుకున్న సందర్భంలోనే రాజ్యసభ హామీ ఇచ్చారు వైఎస్ జగన్. అయితే రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైవీకి ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరుతోంది. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావు స్థానంలో వేరే నేతకు పార్టీ ఇన్ చార్జి గా నియమించిన నేపథ్యంలో ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పించారు.

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడైన రఘునాథరెడ్డి తన 20 ఏళ్ల వయస్సులోనే బెంగళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 2006లో ఎంఆర్ కేఆర్ కన్ట్సక్షన్స్ డైరెక్టర్ గా నియమితులైయ్యారు. ప్రస్తుతం వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. టీడీపీ నుండి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే వైసీపీ ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు.

Breaking: జగన్ పై హత్యాయత్నం కేసు .. కోడికత్తి శ్రీనుకు షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju