NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ బ‌లి దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ చంద్ర‌బాబు… బ్యాక్‌స్టెప్‌…!

ఏపీ అధికార పార్టీ వైసీపీని నిత్యం టెన్ష‌న్‌లో ముంచి తేల్చే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఒక్క‌సారిగా లై ట్ అయ్యారు. ఆ.. పోనీలే! అన్న త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. నిజానికి ఆయ‌న టెన్ష‌న్ పెట్టాలంటే.. ఇప్పు డు వ‌చ్చిన అవ‌కాశం అంతా ఇంతా కాదు. కానీ, ఎందుకో.. వైసీపీని క‌రుణించారు. ఆ పార్టీలో టెన్ష‌న్ త‌గ్గిం చారు. మ‌రి దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? చంద్ర‌బాబు ఏమ‌నుకున్నారు? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయం గా జ‌రుగుతున్న కీల‌క చ‌ర్చ‌.

విష‌యం ఏంటంటే…
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో మూడు స్థానాల‌కు.. ఎన్నిక‌లు ఈ నెల 27న జ‌ర‌గ‌ను న్నాయి. దీనిలో విధిగా ఎమ్మెల్యేలు పాల్గొనాల్సి ఉంటుంది. పార్టీలు విప్ జారీ చేస్తాయి. అయితే.. స‌భ‌లో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేప‌థ్యంలో వైసీపీకి మూడు స్థానాలు ద‌క్కే అవ‌కాశం ఉంది. అయితే.. టీడీపీ కూడా పోటీ చేస్తుంద‌ని అనుకున్నారు. గ‌తంలో 2022లో కూడారాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో త‌మ‌కు బ‌లం లేకున్నా.. వ‌ర్ల రామ‌య్య‌ను చంద్ర‌బాబు పోటీలో పెట్టారు.

ఆయ‌న ఓడిపోయారు. అయితే.. ఆ స‌మ‌యంలో తాము గెలుస్తామ‌ని తెలిసినా.. కూడా వైసీపీని చంద్ర‌బా బు వ‌ర్ల‌ను రంగంలోకి దించ‌డం ద్వారా డిఫెన్స్‌లో పడేశారు. ఫుల్ రేంజ్లో టెన్ష‌న్ పెట్టారు. ఇప్పుడు వైసీ పీకి సొంత నేత‌ల్లోనే వ్య‌తిరేక‌త పెరిగింది. చాలా మంది సిట్టింగుల‌కు సీట్లు లేక‌పోవ‌డం.. మ‌రికొంద‌రిని టికెట్‌లు మార్చ‌డం వంటివి చోటు చేసుకున్నాయి. ఇంకొంద‌రు.. పొరుగు పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తే బాగుంటుంద‌నే వాద‌న వినిపించింది.

అంతేకాదు.. బాబు క‌నుక రంగంలోకి దిగితే.. ఒక్క సీటు ఖ‌చ్చిత‌మేన‌ని.. దీనికి గ‌త ఏడాది జ‌రిగిన ఎమ్మె ల్సీ ఎన్నిక‌లే ఉదాహ‌ర‌ణ అని కూడా.. విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. కానీ, చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా త‌ప్పిం చుకున్నారు. దీనికి కార‌ణం.. ఆయ‌న వైసీపీ కోణంలో కాదు.. త‌న కోణంలోనే ఆలోచించిన ట్టు తెలుస్తోంది. అభ్య‌ర్థిని ప్ర‌క‌టించినా.. గెలుపుపై న‌మ్మ‌కం త‌క్కువ‌. పైగా.. ఏం జ‌రిగినా.. వైసీపీ దానిని అడ్వాంటేజ్‌గా తీసుకుంటుంది.

త‌మ ఎమ్మెల్యేల‌ను లాగేసుకున్నార‌నే ప్ర‌చారం చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదా.. ఒక నాయ‌కుడి ని(ఎవ‌రిని నిల‌బెడితే వారి సామాజిక వ‌ర్గం) బ‌లి చేశార‌ని ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఖాయం. అందుకే ..చంద్ర‌బాబు వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌కుండా.. త‌ప్పించుకున్నార‌నేది సీనియ‌ర్ల మాట‌. పోనీ ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా.. మొత్తానికి వైసీపీకి టెన్ష‌న్ లేకుండా అయితే చేశారుగా అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదీ .. సంగ‌తి!

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N