NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ రాంగ్ ఈక్వేష‌న్లు.. పక్క‌ప‌క్క‌నే 5 సీట్లు లాస్‌…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు సీట్లు మార్చుకుంటూ వెళుతున్నారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద యాంటీ ఉంటే వేరే చోట‌కు మార్చేయ‌డం.. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేను మ‌రో చోట‌కు మార్చేయ‌డం చేస్తున్నారు. అయితే ఈ మార్పులు, చేర్పుల్లో కొన్ని రాంగ్ ఈక్వేష‌న్ల ఎఫెక్ట్‌తో కొన్ని చోట్ల ప‌ట్టులేని, మ‌రీ బ‌ల‌హీన అభ్య‌ర్థుల‌ను పెట్టి చేజేతులా కొన్ని సీట్లు కోల్పోవాల్సిన ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ మార్పులేంటి.. ఈ మాలోకం ఏంట‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే…. నీకు అక్క‌డ బాగుంటుంది.. నువ్వు గెలుస్తావు.. ఇక్క‌డ జ‌గ‌న్‌ను చూసి ఓట్లేస్తారు.. ఇక్క‌డ ఉన్న‌ది జ‌గ‌న్ అంటూ చెప్పి పంపిస్తున్నార‌ట‌.

దీంతో లోప‌ల‌కు వెళ్లిన వాళ్ల‌కు అస‌లేం జ‌రుగుతుందో ? త‌మ బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఉమ్మడి ప్ర‌కాశం జిల్లాతో పాటు ప‌క్క‌నే ఉన్న ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న ఐదు సీట్ల‌లో జ‌గ‌న్ రాంగ్ ఈక్వేష‌న్లు ఐదు చోట్లా కూడా వైసీపీని బాగా దెబ్బ‌కొట్టేలా ఉన్నాయి. చిల‌క‌లూరిపేటలో గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీని గుంటూరు వెస్ట్‌కు పంపారు. ర‌జ‌నీస్థానంలో కొత్త స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ‌చ్చిన మ‌ల్లేల రాజేష్ నాయుడు ఓ కౌన్సెల‌ర్ స్థాయి వ్య‌క్తి అని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.

రాజేష్ నాయుడు ఎంపిక‌ ఆర్థిక‌, సామాజిక కోణంలో పూర్తిగా రాంగ్ ఈక్వేష‌న్ అంటున్నారు. ప‌క్క‌నే ఉన్న ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను త‌ప్పించేసి ఆ ప్లేస్‌లో ఎప్పుడో 2014లో చీరాల‌లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన యెడం బాలాజీని అప్ప‌టిక‌ప్పుడు విదేశాల నుంచి తీసుకువ‌చ్చి ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు. అస‌లు బాలాజీ అక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావుకు ఏ మాత్రం గ‌ట్టి పోటీ దారు కాద‌ని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. ప‌రుచూరును జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందే వ‌దిలేసుకోవ‌చ్చ‌ని లోక‌ల్ వైసీపీ టాక్ ?

ఇక ప‌క్క‌నే ఉన్న అద్దంకిలో ఇన్‌చార్జ్‌గా బాగా గ్రిప్ తెచ్చుకున్న బాచిన కృష్ణ‌చైత‌న్య‌ను కాద‌ని ఎక్క‌డో ఉమ్మ‌డి గుంటూరు జిల్లా ప‌ల్నాడు నుంచి పాణెం హ‌నిమిరెడ్డిని దిగుమ‌తి చేశారు. ఇప్పుడు అక్క‌డ మూడు బ‌ల‌మైన వ‌ర్గాలుగా ఉన్న బాచిన ఫ్యామిలీ, గొట్టిపాటి ర‌వి, క‌ర‌ణం గ్యాంగ్ అంతా హ‌నిమిరెడ్డికి వ్య‌తిరేకంగా ఒక్క‌ట‌వుతున్నారు. అద్దంకిలో టీడీపీ మెజార్టీ 30 వేలు + ఉంటుంద‌ని అప్పుడే లెక్క‌లు స్టార్ట్ అయ్యాయి. ప‌క్క‌నే ఉన్న చీరాల‌లో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ బ‌ల‌మైన లీడ‌ర్‌. అక్క‌డ ఆమంచిని ప‌క్క‌న పెట్టేసి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రుచూరు ఇన్‌చార్జ్‌గా కొనసాగించి.. ఇప్పుడు అక్క‌డ బాలాజీని తీసుకొచ్చారు.

ఇప్ప‌టికే రాజ‌కీయంగా ప్రాబ‌వం కోల్పోయిన క‌ర‌ణం ఫ్యామిలీకి కాస్తో కూస్తో అద్దంకిలో ప‌ట్టుంది. క‌ర‌ణం ఫ్యామిలీని ప‌ట్టులేని చీరాల‌లో కంటిన్యూ చేస్తుండ‌డంతో చీరాల‌లో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింటోంది. ఇక ప‌క్క‌నే ఉన్న సంత‌నూత‌ల‌పాడుకు వేమూరు నుంచి మంత్రి నాగార్జున‌ను దిగుమ‌తి చేశారు. అస‌లు లోక‌ల్ కేడ‌ర్ అయితే నాగార్జున‌ను స‌హించ‌మ‌ని ఓడిస్తామ‌ని శ‌ప‌థాలు చేస్తోంది. ఏదేమైనా జ‌గ‌న్ రాంగ్ ఈక్వేష‌న్ల దెబ్బ‌కు వైసీపీ చాలా సీట్లలో ఎన్నిక‌ల‌కు ముందే ట్ర‌బుల్స్‌లో ప‌డుతోంది.

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?