NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్ పోటీ అక్క‌డ నుంచే.. గ్రీన్‌సిగ్న‌ల్‌తో జ‌న‌సేన‌లో ఫుల్ క్లారిటీ..!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నార‌నే విష‌యంపై దాదాపు క్లారిటీ వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే.. రెండో నియోజ‌క‌వ‌ర్గం మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఒక నియోజ‌క‌వ‌ర్గం అయితే..ఖ‌రారైన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. అదే.. భీమ‌వ‌రం. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే.. ఇప్పుడు ప‌డ్డ చోట నుంచే నిల‌దొక్కుకోవాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఇక్క‌డ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ నివాసం ఉండేలా.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు పార్టీ నాయకులు కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండేలా.. ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. పవన్ కోసం ఇల్లు వెతుకుతున్న జనసేన నేతలు మూడు నుంచి నాలుగు బెడ్ రూంల ఇంటి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు

అందులోనే పార్టీ కార్యాల‌యం కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఇక‌, గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీచేసి ఓటమి పాలైన పవన్ కు 62285 ఓట్లు వ‌చ్చాయి. అయితే.. త్రిముఖ పోటీ నెల‌కొన‌డంతో టీడీపీ నుంచి పోటీ చేసిన పుల‌ప‌ర్తి అంజిబాబుకు.. 54 వేల ఓట్లు వ‌చ్చాయి. అయితే.. ఈ రెండు పార్టీలు ఇప్పుడు క‌లిసి పోటీ చేయ‌నున్న ద‌రిమిలా.. ఈ రెండు ఓట్లు కూడా త‌మ‌కే ప‌డ‌తాయ‌నే అంచ‌నాతో ప‌వ‌న్ ఉన్నారు. దీంతో భారీ మెజారిటీతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇదిలావుంటే, మంగ‌ళ‌వారం నుంచి రెండు రోజులు భీమవరంలో పవన్ బసచేయ‌డంతో పాటు.. ఇక్క‌డి పార్టీ నాయ‌కుల‌తోనూ భేటీ కానున్నారు. పొత్తులు, సీట్ల కేటాయింపులపై పార్టీ కేడ‌ర్‌కు ఆయ‌న వివ‌రిస్తారు. వివాదాలు.. విమ‌ర్శ‌ల‌కు తావు లేకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేయాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో టీడీపీ నాయ‌కుల‌తోనూ ప‌వ‌న్ భేటీ అవుతార‌ని స‌మాచా రం. ఇరుప‌క్షాల వారికీ విందు ఏర్పాటు చేస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju