NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

MLA Lasya Nanditha: అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలకు సీఎం రేవంత్ ఆదేశం

MLA Lasya Nanditha: కంట్రోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా వివిధ పార్టీల ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత భౌతికకాయానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని ఆమె నివాసానికి తరలించారు.

లాస్య భౌతిక కాయం వెంట మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మరో పక్క రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.  లాస్య నందిత నివాసానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. లాస్య నందిత అత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ముందుగా లారీ ఢీకొట్టిన తర్వాత రెయిలింగ్ కు తగిలిందని ఏసీపీ చెప్పారని అన్నారు. లాస్య సీటు బెల్ట్ పెట్టుకోలేదని ఏసీపీ తెలిపారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

కాగా, పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజా ప్రతినిధులు లాస్య నందిత భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు లాస్య నందిత అంత్యక్రియలు చేయనున్నారు.

Lasya Nanditha: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

Related posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N