NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami February 26 2024 Episode 289: పంచమిని ల్యాబ్ కి తీసుకెళ్లిన మోక్ష ప్లాన్ సక్సెస్ అవుతుందా..

Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights

Naga Panchami February 26 2024 Episode 289: నేను మేఘనకు చెప్పే వచ్చాను పంచమి పెళ్లి చేసుకోను ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాను అని మోక్ష అంటాడు. మీరు తొందర పడ్డారు మోక్ష బాబు అని పంచమి అంటుంది.ఎవరికో భయపడికట్టు నా భార్యకు దూరంగా ఉండడం నావల్ల కాదు ఏది జరిగితే అదే జరుగుతుంది అని మోక్ష అంటాడు. మీరు మేఘన అని పెళ్లి చేసుకొని  కాపురం చేస్తే కరాలి మీ జోలికి రాదు అని పంచమి అంటుంది. అందుకు నేను మరో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు పంచమి అని మోక్ష అంటాడు. అందుకు నేను వేరే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు పంచమి మనిద్దరం కలిసి హ్యాపీగా ఉందాం అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights
Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights

నీ భయం నాకు అర్థమైంది పంచమి నిన్ను కలుస్తే చనిపోకుండా ఉండే ప్రయత్నం నేను మొదలు పెట్టాను అది సక్సెస్ అయితే ఆకరాలి నా జోలికి రాదు అని మోక్ష అంటాడు. అలాంటి అవకాశం ఉంటే నేనే చెప్తాను కదా మోక్ష బాబు అని పంచమి అంటుంది. అవకాశాన్ని నేను సృష్టించుకుంటాను అని మోక్ష అంటాడు. మీరు లేనిపోని ఆశలు పెట్టుకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అని పంచమి అంటుంది. నా ప్రాణమే నువ్వు పంచమి నిన్ను వదులుకొని వేరే పెళ్లి చేసుకుంటే నా ప్రాణం వదులుకోవడమే అవుతుంది అని మోక్ష అంటాడు. నా మాట వినరా మీరు అని పంచమి అంటుంది. నేను చెప్తాను కదా రా అని మోక్ష పంచమి ని తీసుకొని వెళ్తాడు.కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights
Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights

మేఘన కరాలి రూపంలోకి మారిపోతుంది. తన మంత్ర శక్తితో కంత్రి తంత్రీలను సృష్టిస్తుంది. చెప్పండి కరాలి ఎవరిని నంజుకు తినాలి అని తంత్రి అంటాడు. అధిక ప్రసంగం చేస్తే మీ పీకలు కొరికి రక్తం తాగుతాను అని కరాలి  అంటుంది. ఏం చేయాలో చెప్పు కరాలి అని తంత్రి అంటాడు. ఒకరి ఇంట్లో ఉండి ఒక పని చేయాలి అని కరాలి అంటుంది. శోభనం చెడగొట్టాం అక్కడికేనా అని తంత్రి అంటాడు. అక్కడ ఒక అమ్మాయిని చిత్రహింసలు పెట్టాలి బయలుదేరుదామా అని కరాలి అంటుంది. మేము సిద్ధమే నాయకి అని కంత్రి తంత్రి అంటారు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights
Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights

నంబూద్రి మళ్లీ జ్వాల ఒంట్లోకి ప్రవేశిస్తాడు. ఫణీంద్ర నీతో మాట్లాడాలి నువ్వు పాము అని నాకు తెలుసు మనిషిగా మారు అని జ్వాల అంటుంది. నేను నాగ లోకపు యువరాజుని పంచమి ని తీసుకువెళ్లడానికి ఇక్కడ ఉన్నాను అని ఫణీంద్ర అంటాడు.అది జరగదు కానీ వేరే దాని గురించి ఆలోచించు అని నంబూద్రి అంటాడు. పంచమి రాదని నేనే ఒక నిర్ణయానికి వచ్చాను అని ఫణీంద్ర అంటాడు. బలవంతంగా తీసుకువెళ్తావా పంచమికి ఇష్టం లేకుండా తీసుకెళ్లడం సాధ్యమయ్యే పనేనా ఫణీంద్ర అని నంబూద్రి అంటాడు. మోక్షని కాటు వేసి చంపేస్తాను పంచమి ఇక్కడ మోక్ష కోసమే ఉంటుంది కాబట్టి మోక్షని చంపేసి పంచమి తీసుకువెళ్తాను అని ఫణీంద్ర అంటాడు. పంచమికి నిజం తెలిస్తే నీతో అస్సలు రాదు అని నంబూద్రి అంటాడు. పంచమి నాతో రావాలంటే ఇంతకంటే వేరే మార్గం నాకు కనిపించలేదు పంచమి ఇక్కడ ఉండకూడదు అని ఫణింద్ర అంటాడు. మేఘన కి మోక్షకి పెళ్లి జరిగితే పంచమి వెళ్ళిపోతుంది అందుకోసం మోక్షని చంపనక్కర్లేదు అని నంబూద్రి అంటాడు. పంచమి కళ్ళ ముందు ఉన్నంతవరకు మోక్ష మీ చెల్లిని పెళ్లి చేసుకోడు పంచమి నాతో రావాలి అంటే మోక్షని చంపక తప్పదు అని ఫణీంద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights
Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights  

ఎక్కడికి తీసుకొచ్చారు మోక్ష బాబు అని పంచమి అడుగుతుంది. రీసర్చ్ ల్యాబ్ కు నువ్వు కూడా ఇక్కడికి రెండుసార్లు వచ్చావు అని మోక్ష అంటాడు. మళ్లీ అలాంటి ప్రయోగం ఏమైనా చేస్తున్నారా అని పంచమి అంటుంది. నీలో రక్తం మీద రీసెర్చ్ చెయ్యాలి  నీలో విషాన్ని తీసేసి మామూలుగా మార్చుకోవాలి అని మోక్ష అంటాడు. మీరు అనవసరమైన ప్రయోగం చేస్తున్నారు మోక్ష బాబు అని పంచమి అంటుంది. సైన్స్ కు సాధ్యం కానిది ఏమీ ఉండదు పంచమి నీలో విషం పోయి మనం ఇద్దరం ఒకటైతే నువ్వు భయపడాల్సిన పని ఉండదు అని మోక్ష అంటాడు. అప్పటిదాకా కరాలి ఊరుకుంటుందా మోక్ష బాబు అని పంచమి అంటుంది. చూస్తూ చూస్తూ నిన్ను వదులుకోలేను నువ్వు నాకు సహకరిస్తే మనం కలిసి ఉండొచ్చు రా అని మోక్ష తీసుకెళ్తాడు పంచమని.కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights
Naga Panchami Today Episode February 26 2024 Episode 289 Highlights

ఏంటి మోక్ష చానలకి కనిపించవు అని ప్రొఫెసర్ అంటాడు. పంచమికి ప్రొఫెసర్ నీ పరిచయం చేస్తాడు మోక్ష. రండి కూర్చొని మాట్లాడుకుందాం అని ప్రొఫెసర్ శంకర్ ని పిలిచి బ్లడ్ శాంపిల్  తీసుకోమని చెబుతాడు. శంకర్ బ్లడ్ తీస్తాడు. శంకర్ ముందు అందులో నుంచి కొంచెం బ్లడ్ ని టెస్ట్ చెయ్యి మిగతా దాన్ని చానా రకాల టెస్టులు చేయాలి అని ప్రొఫెసర్ చెప్తాడు.నా లైఫ్ లో ఇదొక ఛాలెంజ్ సిచువేషన్ సార్ ఎలాగైనా సక్సెస్ కావాలి అని మోక్ష అంటాడు. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు అని ప్రొఫెసర్ అంటాడు. ఇంతలో శంకర్ పిలుస్తాడు. ప్రొఫెసర్ లోపలికి వెళ్తాడు. ఇది సక్సెస్ కావాలనే నీకు ఇష్టమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముక్కుకో పంచమి అని మోక్ష అంటాడు. మీరు పడే తపన చూస్తుంటే నాకు బాధేస్తుంది మోక్ష బాబు అని పంచమి అంటుంది. నువ్వు లేని లైఫ్ని నేను ఊహించుకోలేను అని మోక్ష అంటాడు. ఇంతలో ప్రొఫెసర్ వస్తాడు. ఏమైంది సార్ అని మోక్ష అడుగుతాడు. మన ఊహించినట్టే బ్లడ్ అంతా విషపూరితమైపోయింది మోక్ష అని ప్రొఫెసర్ అంటాడు. బ్లడ్ లో విషన్ని తగ్గించగలమా సార్ అని మోక్ష అంటాడు.తగ్గించగల0 మోక్ష కాని టైం పడుతుంది అని ప్రొఫెసర్ అంటాడు. వీలైనంత తొందరలో పూర్తి చేయండి అంటూ మోక్ష పంచమి తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

మేఘన తన మంత్రి శక్తితో కంత్రి తంత్రిని సృష్టిస్తుంది..

Related posts

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N