NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట

YSRCP: వైసీపీ ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊరట చెందేలా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్ సుమారు 65 నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను మార్పు చేశారు. ఇందులో కొందరు కొత్త వారు కాగా, కొందరు ఎమ్మెల్యేలను మరో నియోజకవర్గానికి పంపారు. ఇంకా ఇన్ చార్జిల మార్పునకు కసరత్తు జరుగుతుందేమో అన్న ఆందోళన కొందరు వైసీపీ ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉంది. దీనికి తెర దించుతూ ఇవేళ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు.

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, మండల, జిల్లా స్థాయి నాయకుల సమావేశంలో జగన్ మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక పూర్తయిందని సీఎం జగన్ చెప్పేశారు. శాసనసభ, లోక్ సభ కు పోటీ చేసే అభ్యర్ధులు దాదాపు ఖరారైనట్లేనని, చాలా స్వల్ప మార్పులు ఉంటే ఉండవచ్చని అన్నారు. మార్చాల్సినవి 99 శాతం ఇప్పటికే మార్చేశామనీ, ఇక పెద్ద మార్పులేవీ ఉండవని క్లారిటీ ఇచ్చేశారు.

45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నది జ్ఞాపకం పెట్టుకుని పార్టీ క్యాడర్ పని చేయాలని సూచించారు. అభ్యర్ధులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పాలని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి కుటుంబాన్ని ఐదారు సార్లు కలవాలని అన్నారు. సోషల్ మీడియాలో క్యాడర్ యాక్టివ్ గా ఉండాలని సూచించారు. ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టిన వారే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని సీఎం జగన్ తాజాగా చేసిన ప్రకటనతో నేతలు అంతా ఒక్క సారిగా ఊపిరిపీల్చుకున్నారు.  

Kapu Ramachandra Reddy: రాజ్‌నాథ్ సింగ్ ను కలిసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ..బీజేపీ గూటికి చేరేందుకే(గా)..!

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju