NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో జోష్ పెరుగుతుందా… వైసీపీ గ్రాఫ్ త‌గ్గుతుందా… ఇదొక్క‌టే 100 % ఎవిడెన్స్ ..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కీల‌క క్ర‌తువును పూర్తి చేసింది. 94 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఒక‌టి రెండు స్థానాల్లో మిన‌హా పెద్ద‌గా ఎక్క‌డా వ్య‌తిరేక‌త లేదు. దీనిని అధిగ‌మించేందుకు త‌మ్ముళ్ల‌ను లైన్‌లో పెట్టేందుకు చంద్ర బాబు కూడా విస్తృత క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే.. రెండు మెట్లు దిగి వ‌చ్చైనా ఆయ‌న త‌మ్ముళ్ల‌ను బుజ్జ‌గించాల‌ని నిర్ణ‌యించా రు. ఈ వ్య‌వ‌హారంతో పార్టీ దెబ్బ‌తిన‌కుండా కూడా చూస్తున్నారు.

అంతేకాదు.. టీడీపీలో ఏర్ప‌డిన ఈ గంద‌ర‌గోళం లేదా.. వివాదాన్ని వైసీపీకి అనుకూలంగా మార‌కుండా చూసుకునేందుకు కూడా చంద్ర‌బాబు రెడీ అయ్యారు. దీంతో చాలా వ‌ర‌కు నాయ‌కులు శాంతిస్తున్నారు. ఇక్క‌డ మ‌రో కీల‌క విష‌యం తెర‌మీద‌కి వ‌స్తోంది. రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు కూడా మారుతున్నా యి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు అంచ‌నాలు త‌గ్గుతున్నాయ‌నే భావ‌న ఏర్ప‌డుతోంది. దీనిని గ‌మ‌నించిన నాయ‌కులు టీడీపీని వీడేందుకు ఇస్ట‌ప‌డ‌డం లేదు.

అయితే.. త‌మ మ‌న‌సులోని మాట‌ను వ్య‌క్త ప‌ర‌చడం ద్వారా భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను మాత్రం వారు ప‌దిలం చేసుకుంటున్నారు. అంటే.. ఎవ‌రూ కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరే ప‌రిస్థితి లేకుండా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హరించినట్టు అయింది. ఇది టీడీపీ సాధించిన తొలి విజ‌యం. ఇక‌, రాష్ట్రంలో అధికారం విష‌యానికి వ‌స్తే.. ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ దూకుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ఒక అంచ‌నాకు వ‌చ్చారు.

ఇది కూడా నాయ‌కులు సైకిల్ దిగిపోకుండా పార్టీని కాపాడుతోంది. ఈ ప‌రిణామాల‌కు తోడు.. జ‌గ‌న్‌ను న‌మ్మ‌లేని రాజ‌కీయ వ్య‌వ‌స్థ ఏర్ప‌డ‌డం కూడా.. నాయ‌కులు జంప్ చేయ‌కుండా అడ్డుక‌ట్ట వేసింది. దీంతో టీడీపీని అధికారంలోకి తెచ్చుకుంటే.. ఏదొ ఒక రూపంలో త‌మ ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంద‌ని.. చిన్న చిన్న ప‌నులు.. ప‌దవులు అయినా ద‌క్క‌క పోతాయా? అనే ఆలోచ‌న త‌మ్ముళ్ల‌లో క‌నిపిస్తోంది. దీంతో టీడీపీ గ్రాఫ్ పెంచేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా టీడీపీకి జోష్ పెరుగుతోంద‌ని, సమ‌స్య‌లు కొలిక్కి వ‌స్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N