NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani March 11 2024 Episode 1185:సుమన ఎవర్ని ద్వేషిస్తుందో ఆవిడే సామ్రాజ్యాన్ని శాసిస్తుంది అంటున్న డమ్మక్క..

Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights

Trinayani March 11 2024 Episode 1185: నీ చెల్లెలు పునర్జన్మెత్తిందా అని నన్ను అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు అని లలిత దేవి అంటుంది. నేను కూడా చూశాను పెద్దమ్మ నైని పేరు నా పేరు ఎవరో కావాలని వేయించారు అని విశాల్ అంటాడు. తిలోత్తము గనుక ఈ పని చేసి0దని తెలిస్తే మర్యాద దక్కదని చెప్పు అని లలితాదేవి అంటుంది. పెద్దమ్మ ఆవేశ పడకండి ఎందుకిలా చేశారో నేను కనుక్కుంటాను అని విశాల్ అంటాడు. త్వరగా కనుక్కో విశాల్ నా పనులన్నీ ఆపుకొని వచ్చి వాళ్ళ పెళ్లి చేస్తాను అని లలితాదేవి ఫోన్ కట్ చేస్తుంది. విన్నారు కదా అమ్మ పెద్దమ్మ ఎంత సీరియస్ గా ఉందో అని విక్రాంత్ అంటాడు. మేము చేసినట్టు మాట్లాడతావ్ ఏంట్రా అని తిలోత్తమ అంటుంది. ముందు విలేకరులు ఉద్యోగస్తులని ఇంటికొచ్చి ప్రశ్నించకుండా ఆపండి అని సుమన అంటుంది. ఎవరికి వారు ఈ పని చేయనట్టు నటిస్తే మరి ఎవరు చేసినట్టు అని డమ్మక్క అంటుంది.

Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights
Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights

మేము క్షమించిన లలితాదేవి క్షమించదు అని నైని అంటుంది. నిజానికి ఆవిడే ఇలా చేసి ఉంటే ఇంకా బాగుండేది అని సుమన అంటుంది. సుమన ఇంటి రహస్యాన్ని బయట పెట్టుకోకూడదు అని విశాల్ అంటాడు. ఎంతకాలం  దాచి పెడతారు  బావగారు అని సుమన అడుగుతుంది. అందరూ వల్లభ బావ ఇంకా తిలోత్తమ వంక చూస్తారు. ఏంట్రా అందరూ నా వంక చూస్తున్నారు అని వల్లభ అంటాడు. అమ్మ ఇంకా ఎందుకు చూస్తున్నారు ఒప్పుకోండి అని విక్రాంత్ అంటాడు. నీ కూతురు మీద ఒట్టే మంటావా అని తిలోత్తమ వెళ్లి ఉలోచిని ఎత్తుకుంటుంది. పెద్దవాళ్ళు అయ్యుండి చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకోవడం ఏంటి అత్తయ్య నిజం చెప్తే సరిపోతుంది కదా అని నైని అంటుంది. నిజం చెప్పాలి కదా అని తిలోత్తమ అంటుంది. ఎవరమ్మా అని విశాల్ అంటాడు. గాయత్రి అక్క ఫోటోని పేపర్లో వేయించింది ఎవరు అని సుమన చేయి తీసి ఉలోచి తల మీద పెట్టి అడుగుతుంది తిలోత్తమ. నేనే అని ఒప్పుకుంటుంది సుమన.

Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights
Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights

లాగిపెట్టి సుమన చెంప మీద ఒకటి ఇస్తుంది తిలోత్తమ. అది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకు కొట్టారు అత్తయ్య అని సుమన అంటుంది. గాయత్రి అక్క ఎక్కడ ఉందో ముందు తెలియాల్సింది మనక ని నీకు తెలియదా అని తిలోత్తమ అంటుంది. నేను ఇలా చేస్తే వాళ్లకు వీళ్ళకి తెలుస్తుందని నన్ను కొడతారా వాళ్ళ అమ్మ గురించి విశాల్ బావకి తెలుసు ఆయనను ఎందుకు అడగరు అని సుమన అంటుంది. చెల్లి ఏమ మాట్లాడుతున్నావ్ అని నైని అంటుంది. లలితా దేవి అత్తయ్య ఇంటికి వచ్చి నన్ను వెళ్ళగొట్టకు ముందే నిజం చెప్పండి బావగారు అని సుమన అంటుంది. బ్రో నువ్వు నాలుగు తగిలించిన నేనేం అనుకోను అని విక్రాంత్ అంటాడు. సుమన మా అమ్మ గురించి నాకు తెలుసని నీతో నేను చెప్పానా అని విశాల్ అంటాడు. నీ కూతురు మీద కొట్టేయడం కాదు నిన్ను కొట్టడం వల్ల ఇంట్లో వాళ్ళ మీద నిందలు వేస్తున్నావా అని దూరందర అంటుంది. నా మాట అబద్ధమైతే విశాల్ బావ గారిని కూడా ఒట్టేసి చెప్పమనండి అని సుమన అంటుంది. ఇక చాల్లే ఆపు అంటూ సుమనని తీసుకొని వెళ్ళిపోతాడు విక్రాంత్.

Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights
Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights

బాబు గారు చెల్లి అలా అంటున్న ఏమి మాట్లాడరేంటి అని నైని అంటుంది. నాకెలా తెలుసు అని విశాల్ అంటాడు. తెలిసినా చెప్పరుగా అని డమ్మక్క అంటుంది. కట్ చేస్తే, సుమన మంచి పని చేశావు అని డమ్మక్క అంటుంది. గాయత్రి పెద్దమ్మ ఫోటో పేపర్లో వేయించడం వల్ల నీకు వచ్చిన లాభమేంటి విక్రాంత్ అంటాడు.డమ్మక్క కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంది. చెప్పమ్మా అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతుందేంటి అని సుమన అంటుంది. నిద్ర పోవడం లేదే మోద్దు ధ్యానం చేస్తుంది అని విక్రాంత్ అంటాడు. కళ్ళు తెరిచిన డమ్మక్క నిజం చెప్పమంటావా పుత్ర అని అడుగుతుంది. నైని వదిన తప్ప ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను అని విక్రాంత్ అంటాడు. సుమన ఎవరిని ద్వేషిస్తుందో ఆవిడే ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది అంటూ డమ్మక్క వెళ్ళిపోతుంది. నేను ఎక్కువగా ద్వేషించేది అనాధ పిల్లలైనా గాయత్రిని మరి తాను ఈ సామ్రాజ్యాన్ని ఎలా శాసిస్తుంది అని సుమన ఆలోచిస్తుంది. ఎక్కువగా ఆలోచించకు బుర్ర ఖరాబ్ అవుతుంది అంటూ విక్రాంత్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే,ఏం చేస్తున్నావ్ మమ్మీ అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights
Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights

విశాల్ కి తెలియకుండా సీక్రెట్ మైక్ ని పెడుతున్నాను అని తిలోత్తమ తన గదిలోకి వెళ్లి మైక్ ని లైట్ దగ్గర పెట్టి వెళ్ళిపోతుంది. అక్కడే వాళ్ళ మాటల్ని గమనించిన శివ ఇంకా ఏం మాట్లాడుకుంటారో అని అక్కడే నిలబడి వింటూ ఉంటాడు.50 అడుగుల దూరంలో ఉండి కూడా విశాల్ మాటలని వినొచ్చు అని తిలోత్తమ అంటుంది. అదేంటో చెప్పు మమ్మీ అని వల్లభ అంటాడు. గాయత్రి అక్క గురించి విశాల్ ఏదో మంతనాలు చేస్తున్నాడు అనిపిస్తుంది అని తిలోత్తమ అంటుంది. అలాంటప్పుడు సుమన ని ఎందుకు కొట్టావు మమ్మీ అని వల్లభ అంటాడు. రేయ్ అలా చేస్తేనే మన మీద డౌట్ రాదురా విశాల్ కి అని తిలోత్తమ అంటుంది. ఈ జిత్తుల మారి రాని ప్లాన్ వేసింది ఇప్పుడు బుల్లబ్బాయి ఏం మాట్లాడినా తెలిసిపోతుంది

Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights
Trinayani Today Episode March 11 2024 Episode 1185 highlights

అతనికి తెలిసేలా చేసేది ఎలా అని శివ అనుకుంటాడు. ఇంతలో విశాల్ వస్తాడు. విశాల్ వస్తున్నాడని వల్లభ తిలోత్తమ వాళ్ళ గదిలోకి వెళ్లి లాప్టాప్ ఓపెన్ చేసి మాటలు విందాం అని హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకుంటారు. కట్ చేస్తే, హాసిని వచ్చి విశాల్ తో మాట్లాడాలని అనుకుంటుంది. ఈ తింగరి ది విశాల్ ని డిస్టర్బ్ చేసేలా ఉంది మమ్మీ అని వల్లభ అంటాడు. రేయ్ నోరు మూసుకొని మాటలు వినరా అని తిలోత్తమా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella