NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 30 2024 Episode 371: రుద్రాణి కి రాహుల్ కి గడ్డి పెట్టిన స్వప్న.. రాజ్ ని అసహ్యించుకున్న శ్వేత.. కనకం,కృష్ణమూర్తి బాధ..రేపటి ట్విస్ట్?

Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights

Brahmamudi March 30 2024 Episode 371: ఈరోజు ఎపిసోడ్ లో రుద్రణి ఆలోచిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న రాహుల్ ఏంటి మామ్ ఆలోచిస్తున్నావు అని అంటాడు. మనకు అద్భుతమైన అవకాశం దొరికింది రా, కానీ దాన్ని మనం నెట్ కాష్ చేసుకోలేకపోతున్నాం అని అంటుంది. ఏది రాజ్ బాబుని తీసుకురావడమేనా అని అంటాడు రాహుల్. ఇలా వారసులంతా గాల్లో నుంచి ఎలా పట్టుకొస్తారు రాజ్ మ్యారేజ్ డే రోజు బాబుని తీసుకొస్తే అందరూ నిలదీసి నిద్రపోయారు తప్ప ఎవరు గట్టిగా ఎదిరించలేదు రాజ్ కాబట్టి తప్పు చేసిన సర్దుకుపోతున్నారు అదే నేనైతే ఎంత పెద్ద రచ్చ చేసే వాళ్ళు అని అంటాడు రాహుల్. నీకు రాజ్ కి పోలిక ఏంటి తల్లిని నేను ఇలా మాట్లాడకూడదు కానీ రాజ్ లాగా నువ్వు కొడుకుని తీసుకువస్తే ఇల్లంతా నర్సరీ ఇలా మారిపోయేది అని అంటుంది రుద్రాణి. నోరు మూసుకొని చెప్పేది విను అని అంటుంది కొడుకుతో, రాజ్ చేసింది పెద్ద తప్పు ఈ తప్పుని ఎత్తి చూపాలి మీడియా దృష్టికి తీసుకెళ్లాలి దుగ్గిరాల వంశంలో కొత్త వారసత్వం పుట్టుకొచ్చిందని ప్రచారం జరగాలి. అప్పుడు రాజ్ ని ఎండి పదవి నుంచి దించేస్తారు కళ్యాణికి కవితలు తప్ప క్లయింట్స్ తో డీల్ చేయడం రాదు కాబట్టి, అల్టిమేట్ గా నిన్నే వారసుడిగా ప్రకటించమని నేను డిమాండ్ చేస్తాను అని అంటుంది. అప్పుడే స్వప్న వాళ్ళ మాట్లాడుకున్న మాటలు అన్నీ విని క్లాప్స్ కొట్టుకుంటూ రూమ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights
Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlight

ఇక స్వప్న మాట్లాడుతూ ఆహా నిలువెత్తు నికృష్టుల్ని చూసి నా జన్మ తరించిపోయింది అని అంటుంది. ఎలా వస్తాయి మీకు ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఇందాక ధాన్యలక్ష్మి ఆంటీ కి గడ్డి పెట్టేటప్పుడు రాజ్ నీకు ఇంటి ఆడపడుచు హోదాని ఇచ్చి గౌరవించాడు.అతను తప్పు చేసి ఉండొచ్చు కానీ మీ విషయంలో మాత్రం నిజాయితీగానే మాట్లాడాడు.మీకు ఆ మాత్రం కూడా విశ్వాసం లేదా అదంతా అక్కడే దులిపేసుకున్నారా అని అడుగుతుంది స్వప్న, ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంటి పునాదుల్ని కదిలించాలని చూస్తున్నారా ఈ ఇంటి పునాదులు పగిలితే ఆ పైకప్పు ముందుగా మీ ఇద్దరి నెత్తిమీద కూలి పడుతుంది. అమ్మ కొడుకులు ఆ ఇటుకలు తయారు చేసుకుంటూ బతకాలి రోడ్డు మీద పడతారు అని స్వప్న అంటే రాహుల్ కోపంగా మేము రోడ్డు మీద పెడితే నువ్వేమైనా అమెరికాలో పడతావా అని అంటాడు. పిచ్చినా బచ్చా నేను ఎందుకు మీతో కలుస్తాను, నాకు తాతయ్య గారు బోలెడంత ఆస్తి రాసిచ్చారని మర్చిపోయారా, నేను నా బిడ్డ కూర్చొని తిన్న తరగని ఆస్తి అది మీరు చేసే పిచ్చి పనుల వల్ల మా కావ్య కేమైనా సమస్య వస్తే మాత్రం మీ ఇద్దరినీ అందరి ముందు నిలబెట్టి కడిగి పడేస్తాను అని స్వప్న ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights
Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights

ఇక మరోవైపు రాజ్ కావ్య ఇద్దరు బిడ్డని ఎత్తుకొని ఆఫీస్ కి వస్తారు.అక్కడ ఉన్న సెక్రటరీ ఎవరు ఈ బిడ్డ అని అడుగుతుంది. చెప్పిన పనులు ముందు కంప్లీట్ చెయ్యి తర్వాత ఇన్ఫర్మేషన్ అడుగుదువు గానివి అని రాజ్ కోప్పడతాడు. శృతి రాజ్ అన్న మాటలకి బాధపడుతుంది నేను బాబు గురించి అడిగితే ఇంతలాగా ఎందుకు అరిచాడు అని అనుకుంటుంది. ఈ బాబు ఎవరన్నా తెలుసుకుంటే, నీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది అదే పని చేస్తే జీతం కూడా వస్తుంది అని అంటే సారీ సారీ అని అంటుంది. సారీ చెప్తున్నావు కానీ ఇక్కడ నుంచి కదలట్లేదు అని అంటాడు రాజ్, వెళ్లి పని చూసుకొని అంటాడు ఇక కావ్య కోపంగా చూస్తూ ఉంటుంది ఇంట్లో మీరు ఏదో చెప్పారు అని కావ్య అంటుంది.లక్ష చెప్తా ఇంట్లో విషయాలు ఇంట్లోనే మర్చిపోవాలి. ఆఫీసులో పని మాత్రమే చేయాలి వెళ్లి వెళ్లిన వేసిన డిజైన్స్ తీసుకురా అని కావున కోప్పడతాడు. అలాగే మీరు వెళ్లి మీ అబ్బాయి తో ఆడుకోండి ఇదిగోండి బ్యాగ్ అని చేతికిచ్చి వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights
Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights

శృతి ఆలోచిస్తూ ఉంటే కావ్య వచ్చి ఆలోచించడం మానేసి ముందు పని చెయ్యి అని అంటే సరే మేడం అని అంటుంది. నేను వేసిన డిజైన్స్ అన్ని నాకు ఇచ్చేయని అంటే సరే అని కావ్యకి డిజైన్స్ ఇస్తుంది. తర్వాత కావ్య ఆ డిజైన్స్ తో పాటు నువ్వు కూడా లోపలికి రా అని అంటే దేనికి మేడం అని అంటుంది పని ఉంది అని అంటుంది నేను రాను మేడం సార్ దగ్గరికి సార్ మళ్లీ నన్ను తిడతారు అని అంటుంది. ఏం పర్లేదు నేనున్నాను కదా అని అంటుంది ఇందాక కూడా మీరు ఉన్నారు కదా అయినా కానీ నన్ను తిట్టారు కదా అని అంటుంది శృతి. ఇందాక నువ్వు బాబు గురించి అడిగావు కాబట్టి తిట్టారు ఇప్పుడు పని కోసం వస్తే ఏమీ అనరు నువ్వు రా అని శృతిని బలవంతంగా రాజ్ ఆఫీస్ రూమ్ లోకి తీసుకు వెళుతుంది కావ్య. అప్పటికే రాజ్ బాబుతో సతమతమవుతూ ఆడిస్తూ ఉంటాడు. వాడుకోవడానికి ఇక్కడ బొమ్మలు ఏం లేవురా అని బాబుతో మాట్లాడుతూ ఉండగాకావ్య శృతి లోపలికి వచ్చి డిజైన్స్ చూపిస్తారు. కావ్య బాబు వైపు చూసి ఏంటి సార్ మీ బాబుకి బొమ్మలు కూడా లేవా పెన్ స్టాండ్ ఇచ్చారు అని అడుగుతుంది. ఆ మాటలకు బొమ్మలు ఇంట్లో ఉంటాయి ఆఫీస్ లో ఉండవు అని అంటాడు రాజ్ కోపం గా అక్కడే ఉన్న శృతి వీళ్ళ మాటలు విని నాకు వీళ్లిద్దరిని చూస్తుంటే ఏమీ అర్థం కావట్లేదు ఇంట్లో ఏమో భార్యాభర్తలు గా ఉంటారు ఆఫీసుకు వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు పరిచయం లేనట్టు మాట్లాడుకుంటారు ఏంటో వీళ్ళని చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది అని అనుకుంటుంది. శృతి బాబు వైపు చూస్తుంటే బాబుకు చూసింది చాలు వీటిని క్లైంట్స్ కి మెయిల్ చెయ్ అని అంటాడు. విజయవాడ నుంచి ట్రైన్ కి వస్తా అంటున్నారు ఏ టైం లో మీటింగ్ అరేంజ్ చేయమంటారు అని వేరే వ్యక్తి వచ్చి అడుగుతారు. ఆఫ్టర్నూన్ నువ్వు పెట్టు అని రాజ్ అంటాడు పక్కనే ఉన్న బాబుని చూసి బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు. ఎవరు సార్ ఈ బాబు అని అడుగుతాడు. పక్కనే ఉన్న శృతి మనకు ఆ బాబు గురించి ఎందుకు మనం వెళ్లి పని చేసుకుందాం అని అంటుంది. పని ఎప్పుడు చేసుకునేదే కదా రాజ్ సార్ బాబుని తీసుకొచ్చాడు అంటే మనకి బాబు ఎవరో తెలియాలి కదా అని అంటాడు.

Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights
Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights

ఇక శృతి వచ్చిన అయిన మీద అరిచేసి అక్కడ నుంచి తీసుకెళ్లి పోతుంది.బయటికి వెళ్లిన తర్వాత శృతిని ఆయన అడుగుతాడు ఏంటి శృతి ఎప్పుడు లేనిది నా మీద కోప్పడ్డావ్ అని అంటే నేను అరవకపోతే బాసే నీ మీద కోప్పడతాడు. అదేంటి అని ఆయన అడిగితే ఆ బాబుకి ఆయనకి ఏదో సంబంధం ఉంది దాని గురించి అడిగితే కోపంతో అరి చేస్తున్నాడు. అంత సీక్రెట్ ఏముంది అని అంటే, శృతి ఆ బాబుకి ఏదో సీక్రెట్ ఉంది బాబు కావ్య మేడం కొడుకు కాదు ఇంకొక మేడం కొడుకు అని అంటుంది అవునా అంటే చిన్నిల అని అంటాడు పక్కన ఉన్న వ్యక్తి. అవును సార్ నాకు అదే డౌటు అని అంటుంది శృతి. అక్కడికి వచ్చిన కావ్య వాళ్ళిద్దరి మాటలు విని షటప్ అని అరుస్తుంది.మీరు ఆఫీస్ కి వచ్చింది ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుకోవడానికా నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని క్యారెక్టర్ మీద అంత నిందలు ఎలా వేస్తారు. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ ఇలా మాట్లాడి ఎదుటి వాళ్ళ జీవితాలు నవ్వులపాలు చేయకండి అని అరుస్తుంది. ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే ఊరుకోను అని, శృతిని ఆయన్ని ఇద్దరినీ మందలించి పంపిస్తుంది.

Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights
Brahmamudi Today Episode March 30 2024 Episode 371 highlights

ఇక మరోవైపు అప్పు కోపంగా ఇంటికి వస్తుంది. కనకం అప్పుని చూసి ఏంటి అలా ఉన్నావు సెలెక్ట్ అవ్వలేదా అని అంటే అయ్యాను అని అంటుంది. ఇంత శుభవార్తను ఇలా నీరసంగా చెప్తావ్ ఏంటి అని అంటుంది. ఏమీ లేదు అని అంటుంది అప్పు, ఏదో ఉంది అని అంటుంది కనుకమ్,ప్రయాణం చేసి వచ్చింది కదా అలసిపోయి ఉంటుందిలే అని అంటాడు కృష్ణమూర్తి కాదయ్యా దీని మొఖం చూస్తుంటే నాకు ఏదో తేడాగా ఉంది అక్కడ వాళ్ళతో గొడవ పడిందా ఏంటి అని అంటుంది వెంటనే అప్పు లేచి అవును అందరితో నేనే గొడవ పెట్టుకుంటా, నాకు గొడవలు పెట్టుకోవడం అంటే సరదా అందుకే అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకొని వచ్చాను అని అంటుంది. అంటే గొడవ జరిగిందా అని అంటుంది కనుకమ్, అవును జరిగింది అని అంటే ఎందుకు గొడవ చేసావ్ అని అంటుంది నచ్చక అని అంటుంది అప్పు ఏం నచ్చలేదు అని అంటుంది కనుకమ్, అక్కడ ఏది నచ్చలేదు నేను పోలీస్ అవ్వట్లేదు అసలు పోలీసు అవ్వాలా ఏంటి అని అంటుంది అప్పు, అదేంటే ఇంత కష్టపడ్డావ్ పోలీస్ అవ్వాలని ఆశ పడ్డావు ఉన్నట్టుండి ఇలా అంటున్నావ్ ఏంటి అని అంటుంది. పోలీస్ అవ్వకుండా ఏం చేస్తావ్ ఖాళీగా ఇంట్లో కూర్చుంటావా అని అంటుంది. బతకాలంటే పోలీస్ మాత్రమే ఇవ్వాలా వేరే పని చేసుకోకూడదా ఏంటి మళ్లీ పిజ్జా డెలివరీ చేసిన బతుకుతాను అని అంటుంది. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనిస్తారా లేదా, బయటే అనుకుంటే ఇంట్లో కూడా ప్రశాంతంగా లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు కోపంగా, నేనేమన్నానని అంత విసుగ్గా వెళ్లిపోతుంది అని అంటుంది కనుకమ్, తనేదో కోపంలో ఉందిలే తర్వాత అదే చెప్తుంది అని అంటాడు కృష్ణమూర్తి ఇద్దరు కలిసి మార్కెట్ కి వెళ్తారు.

ఇక ఆఫీస్ లోకి శ్వేత వస్తుంది.రాజ్ బిడ్డ గురించి చెప్తాడు.శ్వేత కోపంతో రగిలిపోతుంది.నువ్వు చెప్పేది నిజమేనా అని అంటుంది శ్వేత, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి చెప్పి విసిగిపోయాను ఇప్పుడు నిన్ను కూడా నమ్మించాలా అని అంటాడు రాజ్. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అంటుంది శ్వేత. నువ్వు చేసిన పని ఎంత పెద్ద తప్పు నీకు అర్థం అవుతుందా అని అంటుంది. అదంతా కావ్య వింటూ ఉంటుంది. ఇంత తెలివిగా ఇంత పెద్ద విషయం ఎలా దాచి పెట్టావు రాజ్, లేదు నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు అబద్దం చెప్తున్నావు అని అంటుంది. కావ్య కూడా ఇలానే అన్నది అని అంటాడు రాజ్, నిజాన్ని నమ్మలేకపోతోంది కానీ కళ్ళ ముందు బాబు కనిపిస్తున్నాడు కదా అని అంటాడు రాజ్. ఇన్ని రోజులు నువ్వు కావ్య విషయంలో ఎన్ని చెప్పినా, నేను వినకపోవడానికి కారణం ఇదే అని అంటాడు రాజ్. షటప్ రాజ్ ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావ్, ఏ భర్త ఏ భార్యకి చేయని మోసం ఈరోజు కావ్యకి చేశావు. నువ్వు కావ్య విషయంలో మొహమాటపడుతూ ఉంటే నీ ఇగో ప్రాబ్లం అనుకున్నాను కానీ, నీ మనసులో ఇంత కుట్ర దాగి ఉందని తెలుసుకోలేకపోయాను అంటుంది శ్వేత ఆ మాటలు అన్నీ కావ్య విని షాక్ అవుతుంది.నీ మనసులో ఇంత కుట్ర దాగుందా, నువ్వు కావ్యని వద్దు విడాకులు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటే కావ్య గొప్పతనం తెలుసుకోలేకపోతున్నావు అనుకున్నాను. నువ్వు మరొక ఆడదాని మనసులో పెట్టుకోకపోవడం వల్ల ఇదంతా చేస్తున్నావని నేను అంచన వేయలేకపోయాను. చిన్నప్పటినుంచి కలిసి పెరిగి నేనే జరిగింది నమ్మలేకపోతున్నాను పాపం నీ భార్య నిన్నే పిచ్చిగా ప్రేమించి నీతోనే జీవితం పంచుకోవాలనుకుంది అలాంటి తన మనసుని ముక్కలు చేశావు రాజ్ అని అంటుంది శ్వేత. నన్ను అడ్డుపెట్టుకుని కావ్య ని దూరం చేసుకోవాలని నువ్వు చెప్పినప్పుడు, కావ్య గురించి నీకు అర్థం అయిన రోజు కావ్య ని అర్థం చేసుకొని మీ ఇద్దరూ ఒకటవుతారులే అని ఆశ పడ్డాను. కానీ నువ్వు ఇలా, చి నువ్వు చేసిన పని తలచుకుంటుంటేనే నాకు అసహ్యంగా ఉంది రాజ్ అని అంటుంది. సంవత్సరం పాటు ఒకే గదిలో కలిసి ఉంటున్నారు కదా కళ్ళ ముందు ఆ పిచ్చిది నిన్ను లోకం అనుకొని తిరుగుతుంటే నువ్వు తప్పు చేసావ్ అని అనిపించలేదా అని అంటుంది శ్వేత. మీ అమ్మ ఒక వైపు మీ ఇంట్లో వాళ్ళు మరొకవైపు కావ్యని చూటి ముట్టి మాటలతో హింసిస్తూ ఉన్నా ఏదో ఒక రోజు నీ మనసు కరిగి తనని ఏలుకుంటావని నమ్మిన ఆ పిచ్చి దాన్ని చూస్తుంటే మీరు జాలి కలగలేదా అని అడుగుతుంది శ్వేత. అమ్మోరికి బలి ఇచ్చే ముందు వరకు కూడా ఆ పశువుని మంచిగానే చూసుకుంటారు కానీ నువ్వు, కావ్యకి నరకం చూపించి మరి కావ్యని బలి చేశావు ఇదెక్కన్యాయం రాజ్ అని అంటుంది.ఆడవాళ్ళు అంటే దేవతలను మీటింగ్లో చెప్తావు కదా ఏమైంది నీ సంస్కారం నలుగురిలో చెప్పడానికైనా నీ నీతులు, కావ్య కి నువ్వు చేసిన అన్యాయం తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది అలాంటిదే ఆ పిచ్చిది తనలో తాను ఎంత నరకం అనుభవిస్తుందో, నీకంటే నా మొగుడు నయం రాజ్ వాడి శాడిస్ట్ అని చెప్పి మరి టార్చర్ చేశాడు.వాడు చేసిన గాయాలు కాలంతో పాటు కరిగిపోతాయి కానీ నువ్వు మంచితనం ముసుగులో కావ్య మనసుకు చేసిన గాయం ఆ పిచ్చిది బతికినంత కాలమ్ మోయాల్సిందే అని అంటుంది శ్వేత. దీనికన్నా నువ్వు ఆ పిల్లని చంపేయాల్సింది నీ మీద ప్రేమతో అయినా తన ప్రాణం ఇచ్చేసేది నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అక్కడ నుంచి కోప్పడి వెళ్ళిపోతుంది. అదంతా విని కావ్య పక్కకు వెళ్ళిపోతుంది. అంటే తన ఫ్రెండ్ కూడా ఈ బాబు గురించి తెలియదు అనమాట అని కావ్య అనుకుంటుంది. ఎవరికీ చెప్పను మంచి ఉన్నట్టుండి ఈ బాబుని ఎందుకు తీసుకొచ్చాడు అసలు ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది.

ఇక మరోవైపు కావ్య బాబుకి బొమ్మలు తీసుకొని వెళుతూ ఉంటుంది. అప్పుడే కావ్య ఎదురుగా వాళ్ళ అమ్మానాన్న కనిపిస్తారు. కావని చూసి కనకం కృష్ణమూర్తి బాధపడతారు. కూతురి బతుకు ఎంత గొప్పగా ఉందో ఒకసారి చూడయ్యా అని అంటుంది. అంతఃపురంలో ఆ రాజు గారి భార్య చిన్న రాణి గారికి పుట్టిన యువరాజు కోసం ఆట వస్తువులు కొనుక్కోవడానికి రోడ్డున పడింది అని అంటుంది. ఏంటమ్మా ఇది? నువ్వు ఇవన్నీ కొనుక్కొని వెళ్లడం ఏంటి అని అంటాడు కృష్ణమూర్తి. పరిస్థితులతో రాజీ పడ్డావా నీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నావా, అని కృష్ణమూర్తి కావ్యని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో రుద్రాణి మళ్లీ పంచాయతీ పెడుతుంది. ఒకప్పుడు నా కొడుకు అమ్మాయిలతో తిరుగుతాడని, అసమర్థుడని వారిని ఆఫీస్ లోకి అడుగుపెట్టకుండా చేశారు వదిన నీ కొడుకు మాత్రం ఏ సమర్థత వెలగ పెట్టాడు అని అపర్ణని నిలదీస్తుంది. రాహుల్ నీ కంపెనీ చూసుకుని హక్కు లేనప్పుడు రాజ్ కి మాత్రం ఆ సీట్లో కూర్చొని అర్హత ఎక్కడుంది అని అడుగుతుంది రుద్రాణి. అపర్ణ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అని రాజ్ వైపు చూస్తుంది. ఏం చేయమంటావో చెప్పు మమ్మీ అని అంటాడు రాజ్. చేసిన తప్పుకి పత్యాత్యాపంగా బిడ్డని నువ్వు వదిలేసి రావాలి అని అంటుంది. లేదు అంటే దీనికి పరిహారంగా, నువ్వు కంపెనీ బాధ్యతలు వదిలేసుకోక తప్పదు అని అంటుంది అపర్ణ. రాజ్ షాక్ అవుతాడు ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తుంటారు.

Related posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N