NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాబు చేసిన త‌ప్పుకంటే.. జ‌గ‌న్ చూపిస్తున్న న‌ర‌క‌మే డ్యామేజీ చేస్తోందా..!

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్లు త‌మ సేవ‌ల‌కు దూరమ‌య్యారు. దీంతో కీల‌క‌మైన పింఛ‌న్ల పంపిణీ వ్య‌వ‌హారం.. రాజ‌కీయ దుమారం రేపింది. వ‌లంటీర్లు ఆగిపోవ‌డానికి.. చంద్ర‌బాబు చేసిన ప‌ని కార‌ణ‌మ‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. దీనిని తొలి రెండు రోజులు మెజారిటీ ప్ర‌జ‌లు న‌మ్మారు. ప్ర‌తి నెలా 1వ తేదీనే త‌మ ఇంటికి వ‌చ్చి త‌లుపు కొట్టి మ‌రీ పింఛ‌న్లు పంపిణీ చేసిన వలంటీర్ల‌ను చంద్ర‌బాబు ఆపించ‌డ‌మేంట‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా గ‌త రెండు రోజులు ల‌బ్ధిదారులు గ‌గ్గోలు పెట్టారు.

దీనికి కార‌ణం చంద్ర‌బాబు, ఆయ‌న ప‌రివారం చేసిన కుట్ర‌లేన‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకున్నారు. మొత్తానికి బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఇక‌, అప్ప‌టి నుంచి ఈ చ‌ర్చ యూట‌ర్న్ తీసుకుంది. పింఛ‌న్ల పంపిణీ గంట‌ల కొద్దీ ఆల‌స్యం కావ‌డం.. నిధులు కూడా స‌క్ర‌మంగా పంపిణీ చేయ‌క‌పోవ‌డంతో వంద‌ల మంది ల‌బ్ధి దారులు గంటల కొద్దీ వేచి.. చూసి సొమ్మ‌సిల్లిన సంద‌ర్భాలు కూడా క‌నిపించాయి. ఇది అంతిమంగా జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకుంది.

చంద్ర‌బాబు వ‌లంటీర్ల‌ను ఆపేశారు. బాగానే ఉంది. మ‌రి స‌చివాల‌యాల‌కు వ‌చ్చిన మాకు పింఛ‌న్లు స‌క్ర‌మంగా ఇవ్వాలి క‌దా..?  ఇది చంద్ర‌బాబు త‌ప్పు కాదు క‌దా! జ‌గ‌నే ఉద్దేశ పూర్వ‌కంగా నిధులు ఇవ్వ కుండా.. గంట‌ల కొద్దీ మ‌మ్మ‌ల్ని కూర్చోబెట్టారు. క‌నీసం కూర్చునేందుకు ఎలాంటి ఏర్పాటు చేయ‌లేదు. టెంట్లు వేస్తామని చెప్పారు. నీళ్లు ఇస్తామ‌న్నారు. కానీ, ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇది చంద్ర‌బాబు త‌ప్పు కాదు క‌దా!` అని మెజారిటీ పింఛ‌ను దారులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం వంటి ఉత్త‌రాంధ్ర‌లోని వెనుక‌బ‌డిన జిల్లాల‌లో అయితే.. బుధ‌వారం రాత్రి 8 గంటల వ‌ర‌కు కూడా పింఛ‌ను దారులు అక్క‌డే ఉన్నా.. వారికి రూపాయి కూడా ఇవ్వ‌లేదు. దీంతో ఈ ప‌రిణామం జ‌గ‌న్ కు చుట్టుకుంది. జ‌గ‌న్ కావాల‌నే ఇలా చేస్తున్నారంటూ.. వృద్ధులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు ఆరోపించారు. త‌మ‌పై ప్రేమ ఉంటే.. డ‌బ్బులు రెడీ చేసుకుని.. ఉండాల్సింది. కానీ, ఆయ‌న డ‌బ్బులు లేకుండా మ‌మ్మ‌ల్ని పిలిచి ఘోష పెడుతున్నారంటూ.. చాలా మంది వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. వ‌లంటీర్ల‌ను ఆపార‌న్న ఆవేద‌న కంటే కూడా.. స‌చివాల‌యాల‌కు వ‌చ్చినా.. పింఛ‌న్లు ఇవ్వ‌లేద‌న్న ఆవేద‌న‌.. పింఛ‌ను దారుల్లో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?