NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి

YS Sharmila: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లాలో ఇవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ్య అభ్యర్ధిగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. షర్మిల బస్సు యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిల్లి కృపారాణి, రామ్మోహన్ రావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భం లో వారికి షర్మిల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం కృపారాణి మాట్లాడుతూ..జగన్, వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని, అలాంటి తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వైఎస్ఆర్ అంటే దేవుడితో సమానమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. షర్మిలలో వైఎస్ఆర్ ను చూస్తున్నామన్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ఒక నియంత అని, ఆయనను గద్దె దించాలన్నారు. కడప ఎంపిగా షర్మిలకు అవకాశం కల్పించాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కృపారాణి 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి  పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి కింజరాపు ఎర్రన్నాయుడు చేతిలో పరాజయం పాలైయ్యారు. అయితే ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఎర్రంనాయుడుపై విజయం సాధించారు. తొలి సారి లోక్ సభకు ఎన్నికైనా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా పని చేశారు. 2014 ఎన్నికల్లో అదే లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోవడంతో కృపారాణి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.

పార్టీలో చేరిన మరుసటి వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా కృపారాణికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే ఆమెకు లోక్ సభ స్థానాన్ని కేటాయించలేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తగిన ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించారు. ఈ సారి శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలని భావించినా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించలేదు. దీంతో పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కృపారాణి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు.

CM Ramesh: అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ పై కేసు నమోదు

Related posts

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N