NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Rashmika Mandanna: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. ర‌ష్మిక ఏం చ‌దువుకుంది.. ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Rashmika Mandanna: గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకున్న స్టార్ బ్యూటీ రష్మిక మందన్నా బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా రష్మిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో సుమన్ మరియు మదన్ మంద‌న్నా దంప‌తుల‌కు ర‌ష్మిక జన్మించింది. ఆమె తండ్రి ఒక కాఫీ ఎస్టేట్ మరియు స్వగ్రామంలో సెరినిటీ అనే ఫంక్షన్ హాల్ ను ర‌న్ చేస్తుండ‌గా.. త‌ల్లి హౌస్ వైఫ్‌గా ఉన్నారు. ర‌ష్మిక‌కు ఒక చెల్లెలు కూడా ఉంది.

ర‌ష్మిక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జ‌న్మించింది. ర‌ష్మిక చిన్న‌త‌నంలో ఆమె కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొన్నేళ్ల‌కు ఆర్థికంగా నిల‌దొక్కుకున్నారు. ర‌ష్మిక గోనికొప్పల్‌లోని కూర్గ్ పబ్లిక్ స్కూల్, బోర్డింగ్ స్కూల్‌లో పాఠ‌శాల విద్య‌ను పూర్తి చేసింది. బెంగుళూరులోని రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలిజీ నుంచి సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్‌లో ర‌ష్మిక‌ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. స్ట‌డీస్ కంప్లీట్ అయ్యాక యాక్టింగ్ ఉన్న మ‌క్కువతో ర‌ష్మిక మోడ‌లింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

2014లో టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డును అక్షయ్ కుమార్ చేత అందుకుంది. ఆపై క్లీన్ అండ్ క్లియ‌ర్ అనే ఫేస్ క్రీమ్ ప్రమోషనల్‌ యాడ్‌లో నటించింది. 2016లో కన్నడ రొమాంటిక్ కామెడీ మూవీ కిరిక్ పార్టీ తో ర‌ష్మిక వెండితెర‌పై హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది. ర‌ష్మిక‌కు మ‌రిన్ని అవ‌కాశాలను తెచ్చిపెట్టింది. అలా ర‌ష్మిక 2018లో ఛ‌లో మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఛ‌లో మూవీ విజ‌య‌వంతం అయింది.

అదే ఏడాది ర‌ష్మిక గీత గోవిందం మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ ర‌ష్మిక కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆమెకు యూత్ లో విప‌రిత‌మైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత ర‌ష్మిక వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో స్టార్ హీరోల‌కు జోడీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ స్టార్ హోదాను సంపాదించుకుంది. 2021లో వ‌చ్చిన పుష్ప: ది రైజ్ మూవీ ర‌ష్మిక‌కు పాన్ ఇండియా స్థాయిలో నేమ్ అండ్ ఫేమ్ ను తీసుకొచ్చింది.

దాంతో ర‌ష్మిక తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. ఇటీవ‌లె యానిమ‌ల్ మూవీతో బిగ్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం పుష్ప 2, ది గ‌ర్ల్ ఫ్రెండ్, రెయిన్ బోతో స‌హా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ర‌ష్మిక చేతిలో ఉన్నాయి. అలాగే మ‌రోవైపు అనేక పాపుల‌ర్ బ్రాండ్స్ కు అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ ఏడాది ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ విడుద‌ల చేసిన ఫోర్బ్స్ ఇండియా 30 అండ‌ర్ 30 జాబితాలో ర‌ష్మిక చోటు ద‌క్కించుకోవ‌డం మ‌రొక విశేషం. ఇక ఆస్తుల విష‌యానికి వ‌స్తే.. సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత ర‌ష్మిక ఆస్తుల‌ను భారీగానే కూడ‌బెట్టింది. ప‌లు నివేదిక‌లు ప్ర‌కారం.. ర‌ష్మిక నిక‌ర విలువ రూ. 45 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తోంది.

Related posts

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu