NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: జగన్ అధికారాన్ని దించేందుకు మూడు పార్టీల కలయిక – చంద్రబాబు

Chandrababu: జగన్ అధికారాన్ని దించేందుకే మూడు పార్టీలు కలిశాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ .. అక్రమ కేసులు పెట్టి పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీని భూస్థాపితం చేసే సమయం ఆసన్నమయిందని అన్నారు.

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మూడు పార్టీలు కలిశాయన్నారు. సైకిల్ స్పీడ్ కు తిరుగులేదు, గ్లాసు జోరుకు ఎదురులేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. వ్యక్తిగత దాడులు తట్టుకుని పవన్ నిలబడ్డారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదట చెప్పిన వ్యక్తి పవనేనని అన్నారు. ఏపీని కాపాడుకోవాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. అక్రమాలను ఎదుర్కొనేందుకు పవన్ ధైర్యంగా నిలబడ్డారని అన్నారు.

మూడు పార్టీలు కలవడంతో వైసీపీకి డిపాజిట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. జనం జగన్ ను తరిమి కొడితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీలను రోడ్డు మీదకు రాకుండా అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఒక అహంకారి విధ్వంసకర పాలనపై ధ్వజమెత్తింది తాను, పవన్ మాత్రమేనని అన్నారు. సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.

నాకు అనుభవం ఉంది.. పవన్ కు పవన్ ఉంది. అగ్నికి వాయువు తోడేనట్లు.. ప్రజాగళానికి వారాహి తోడైంది అని అన్నారు. అహంకారాన్ని బూడిద చేస్తుందని అన్నారు. పోలవరాన్ని 72 శాతం పూర్తి చేసిన బాధ్యత ఎన్డీఏ పార్టీలకే దక్కిందన్నారు. అమరావతిని నిర్మించి అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని భావించామని అన్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు.

అభివృద్ధి కావాలా? విధ్వంసం కావాలా? సంక్షేమం కావాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పరదాలు కట్టుకుని తిరిగిన జగన్ మళ్లీ వస్తున్నాడని, ఈసారి తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ప్రజలు కన్నెర్ర చేస్తే చిప్ప పట్టుకుని జగన్ లండన్ పారిపోతాడని అన్నారు. సూపర్ సిక్స్ లో మహిళలకు చోటు కల్పించామని తెలిపారు.

వాలంటీర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని భరోసా ఇచ్చారు. అలానే వాలంటీర్ల పారితోషికాన్ని రూ.5వేల నుండి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఈ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పారు. వాలంటీర్లను చెడగొట్టాలని జగన్ చూస్తున్నారని అన్న్నారు. కూటమి తరపున నిర్ధిష్ట అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారు.

మే 13న స్వేచ్ఛగా, ఆలోచించి ఓటేయాలని చంద్రబాబు కోరారు. కులం, మతం, ప్రాంతం కాదు ముఖ్యం కాదని, మీరిచ్చే ఓటుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలని పిలుపు నిచ్చారు. జగన్ ఒక ఫేక్ ఫెలో అని ఘాటు గా విమర్శించారు. తాను, పవన్ అన్యోన్యంగా ఉంటే సోషల్ మీడియాలో మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. పవన్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారన్నారు. ఫేక్ న్యూస్ నమ్మకుండా ఒకసారి చెక్ చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు.

TMC Vs BJP: ముద్దు రేపిన మంట .. టీఎంసీ వర్సెస్ బీజేపీ

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju