NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

విజయవాడ తూర్పు నియోజకవర్గం.. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండే నియోజకవర్గం. పైన అమ్మవారు… కింద కమ్మవారు అని డీజే సినిమాలో హీరో అల్లు అర్జున్‌ చెప్పినట్లుగానే విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఉండేది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇలాంటి నియోజకవర్గంలో ఈసారి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయాల్లో సీనియర్‌ మోస్ట్‌ నాయకుడు… జూనియర్‌ నేతతో తలపడుతున్నాడు. టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్‌రావు పోటీ చేస్తుండగా… వైసీపీ తరఫున దేవినేని అవినాష్‌ పోటీ పడుతున్నాడు.

ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఈ ఇద్దరు గత ఎన్నికల సమయంలో టీడీపీలో ఉన్న వారే. 2019లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన అవినాష్‌.. ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీలో చేరారు. చేరిన నాటి నుంచే విజయవాడ ఈస్ట్‌ నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టారు. ఇక జగన్‌ కూడా తొలి నుంచి విజయవాడ ఈస్ట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్‌ అంటూ ప్రకటించారు. అందుకు తగినట్లుగానే అవినాష్‌ కూడా నిత్యం తూర్పు నియోజకవర్గం ప్రజలతోనే గడిపారు. అయితే ఈ నియోజకవర్గంలో సీనియర్ మోస్ట్‌ నేతగా గుర్తింపు తెచ్చుకున్న గద్దె రామ్మోహన్‌ ముచ్చటగా మూడోసారి తూర్పు నుంచి పోటీ పడుతున్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అవినాష్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నాడనేది వాస్తవం. ఇంకా చెప్పాలంటే అవినాష్‌ గెలుపు కోసం స్వయంగా జగన్‌ కూడా రంగంలోకి దిగారు. ఎలాగైనా సరే అవినాష్‌ గెలివాలని ఇప్పటికే కిందిస్థాయి నేతలకు జగన్‌ ఆదేశించినట్లు సమాచారం. అయితే ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్‌ను ఓడించటం అంత సులువు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీనియర్‌ నేతగా ఉన్న రామ్మోహన్‌… సౌమ్యునిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ చిన్న సాయం కావాలన్నా సరే… లేదనకుండా చేస్తారనే పేరు రామ్మోహన్‌ సొంతం. లబ్బీపేట, పటమట వంటి క్లాస్‌ ఏరియాలతో పాటు… రాజరాజేశ్వరి పేట, కృష్ణలంక కాలనీ వంటి మాస్‌ కాలనీలు కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి.

లబ్బీపేటలో ఏ సమస్య అయినా.. అటు కృష్ణలంక వాసులకు ఏ ఇబ్బంది అయినా సరే.. గద్దె నేరుగా హాజరవుతారు. వీటన్నిటికీ తోడు వరదల నుంచి రక్షణగా కృష్ణా నది వెంట రిటైనింగ్‌ వాల్‌ నిర్మించటం గద్దెకు ప్లస్‌ పాయింట్‌. ఇదే సమయంలో టీడీపీ కార్పొరేటర్‌ చలసాని గోపిపై అవినాష్‌ వర్గం దాడి చేసింది. ఈ దాడిలో గోపి కన్ను పోయింది. విజయవాడలో చలసాని గోపికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే.. రాజకీయాల్లో ఆస్తులు పొగొట్టుకున్న నేత గోపి. అలాంటి గోపిపై దాడి చేయటం వల్ల కమ్మ సామాజికవర్గంతో పాటు పటమటలో ఆయన అభిమానులు కూడా అవినాష్‌పై ఆగ్రహంతో ఉన్నారు.

రాబోయే ఎన్నికల్లో గోపిపై దాడి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇక వీటన్నిటికి తోడు… విజయవాడలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది వాస్తవం. సరైన రోడ్లు లేకపోవడంతో పాటు ఈ ఐదేళ్లల్లో డ్రైనేజ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయలేదు. ఉపాధి అవకాశం లేకపోవడంతో గతంలో ఈ ప్రాంతంలోనే ఉన్న పలు సంస్థలు మూతపడ్డాయి. ఇవన్నీ కూడా వైసీపీకి ఎదురుదెబ్బలే. మొత్తానికి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరోసారి గద్దె రామ్మోహన్‌రావుకు ఎడ్జ్ ఉన్నా ఎన్నిక‌ల చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ఏదైనా జ‌ర‌గొచ్చు..!

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?