NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

రాజ‌కీయాల్లో ఒక్కొక్క‌సారి అనుకున్న‌వి ఏవీ కూడా అనుకున్న‌ట్టుగా జ‌ర‌గ‌వు. రివ‌ర్స్ అవుతుంటాయి. ఇలాంటి ఘ‌ట‌నే తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రుగుతోంది. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఓడించాల‌నే రాజ‌కీయ పార్టీగా వైసీపీ ల‌క్ష్యం. ఇది స‌హ‌జం కూడా.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఓడిపోవాల‌నే క‌దా.. టీడీపీ అయినా.. బీజేపీ అయినా.. జ‌న‌సేన అయినా ల‌క్ష్యంగా పెట్టుకుంటాయి. ఈ క్ర‌మంలో వైసీపీ పెట్టుకున్న ల‌క్ష్యాన్ని కూడా కాద‌న‌లేం.

ఈ నేప‌థ్యంలో పిఠాపురంలోని గొల్ల‌ప్రోలు, పిఠాపురం, కొత్త‌ప‌ల్లె మండ‌లాలు ఉన్నాయి. వీటిలో పిఠాపురం మిన‌హా మిగిలిన రెండు మండ‌లాల బాధ్య‌త‌ల‌ను ఇటీవ‌ల వైసీపీ తీర్తం పుచ్చుకున్న ముద్ర‌గ‌డ ప‌ద్మనా భానాకి వైసీపీ అప్ప‌గించింది. కుదిరితే పిఠాపురంలోనూ ప‌ర్య‌టించాల‌ని తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో ము్ద్ర‌గ‌డ‌.. త‌న‌కు కేటాయించి కొత్త‌ప‌ల్లె, గొల్ల‌ప్రోలు మండ‌లాల్లో ఉద‌యం 6 గంట‌ల‌కే ప్ర‌త్య‌క్ష‌మవుతు న్నారు. ఇక్క‌డి నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

వీటిలోనూ గొల్ల‌ప్రోలు మండ‌లంలో ప‌ద్మ‌నాభానికి స్నేహితులు, బంధువులు కూడా ఎక్కువ‌గా ఉండడం తో ఇది ఆయ‌న‌కు మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇక్క‌డి ప్ర‌తి ఓటూ.. వైసీపీకి ప‌డేలా చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. మొత్తం 60 వేల ఓటు బ్యాంకు ఇక్క‌డ ఉంది. దీంతో ఇక్క‌డ ఎక్కువ‌గా శ్ర‌మిస్తు న్నారు. అయితే.. ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు బాగానే ఉన్నా.. గ‌తంలో కాపు ఉద్య‌మం చేసిన‌ప్పుడు కూడా గొల్ల‌ప్రోలు మండలంపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు.

ఈ మండ‌లం నుంచే ముద్ర‌గ‌డ‌కు ఎక్కువ‌గా మ‌ద్ద‌తు కూడా ల‌భించింది. అయితే.. ఆయ‌న కాపు ఉద్య మాన్ని వివిధ కార‌ణాల‌తో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌డెన్‌గా వ‌దిలేశారు. అదే ఇప్పుడు ఆయ‌న‌కు శాపంగా మారింది. ఇక్క‌డి ఆయ‌న స్నేహితులు, స‌న్నిహితులు.. ఈ విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. మ‌మ్మ‌ల్ని ఉద్య‌మానికి దింపి.. మీరు స‌డెన్‌గా వ‌దిలేశారు.. రీజ‌నేంటిఅనేది వారి ప్ర‌శ్న‌. దీనికి ముద్ర గ‌డ చెబుతున్న స‌మాధానం వారికి మింగుడు ప‌డ‌డం లేదు.

దీంతో ముద్ర‌గడ స‌మావేశాల‌ను.. ఆయ‌న చేస్తున్న దిశానిర్దేశాల‌ను లైట్ తీసుకుంటున్నారు. పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ముద్ర‌గ‌డ‌కు.. త‌న ఉద్య‌మ‌మే.. ఇప్పుడు ఇబ్బందిగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. ఒక‌ప్పుడు ఆయ‌న పిలుపునిస్తే.. వ‌చ్చిన నాయ‌కులు కూడా ఇప్పుడు రావ‌డం లేదు. వ‌చ్చినా ఆయ‌న మాటలు వినీ విన‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫ‌లితంగా 60 వేల ఓటు బ్యాంకు పై సందేహాలు నెల‌కొన్నాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju