NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అయిదుగురు యువకులను సిట్ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా భావిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది.

నిందితుల సమాచారం అందిస్తే రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే నిందితుడి సమాచారం పోలీసులకు చక్కింది. అయితే నిందితుడు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన మైనర్లు అని తెలుస్తొంది. మంగళవారం పోలీసు బలగాలు వడ్డెర కాలనీకి చేరుకుని పలువురు యువకులను వ్యాన్ లో ఎక్కించి తరలించడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని రేపింది. అదుపులో తీసుకున్న వారిని పోలీసుల  విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లినట్లు సమాచారం తెలియడంతో వడ్డెర కాలనీ కుటుంబ లు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి.

అయితే అక్కడ తమ పిల్లల జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు ఆకతాయిగా కూడా రాళ్లు విసిరే బ్యాచ్ కాదని వడ్డెర కాలనీ వాసులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే కొందరు సెల్ ఫోన్ లో రికార్డు చేసిన వీడియో ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తొంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు దీనిపై మీడియా సమావేశంలో నిందితుల అరెస్టు విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

మరో పక్క సీఎం జగన్ పై  రాయి దాడి కేసులో తమ వారిని అక్రమంగా నిర్బంధించారంటూ వడ్డేర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. డాబా కొట్ల సెంటర్ లో పోలీసుల తీరుకు నిరసనగా రాస్తారోకో చేశారు. సీఎం రోడ్డు షో వద్ద తమ పిల్లలు లేకపోయినా అయిదుగురుని మంగళవారం తెల్లవారుజామున పోలీసులు తీసుకువెళ్లారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఆరోపించినట్లు ఈ దాడిలో కుట్ర, రాజకీయ కోణం ఉందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.. అకతాయులు చేసిన పనా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju