NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో జన్మించిన రాజ్ తరుణ్ డైరెక్టర్ కావాలని కలలు క‌న్నాడు. ఆ కలను నెరవేర్చుకునేందుకు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో అనూహ్యంగా ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా చేసే అవకాశం రాజ్ తరుణ్ కు వచ్చింది. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఇది. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సన్ షైన్ సినిమా బ్యానర్లపై నాగార్జున, పి రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో అవికా గోర్, రాజ్ తరుణ్ జంటగా నటించారు. 2013లో విడుదలైన ఈ చిత్రం భారీ విషయాన్ని సొంతం చేసుకుంది.

ఉయ్యాల జంపాల అనంతరం రాజ్ త‌రుణ్ సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్ చిత్రాలతో మరో రెండు హిట్లు ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాతే రాజ్‌ తరుణ్ బ్యాడ్ టైమ్‌ స్టార్ట్ అయింది. హీరోగా చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు, ఈడోరకం ఆడోరకం, మజ్ను, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రంగుల రాట్నం, లవర్, ఇద్దరి లోకం ఒకటే వంటి చిత్రాలు రాజ్ తరుణ్ కు షాకుల మీద షాకులు ఇచ్చాయి. అయినా సరే రాజ్‌ తరుణ్ వెనకడుగు వేయలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల‌ను అలరిస్తున్నాడు. సక్సెస్ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు.

2022లో ఆహ నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ తో రాజ్ త‌రుణ్‌ డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. శివాని రాజశేఖర్ హీరోయిన్ గా న‌టించిన‌ ఈ సిరీస్ కు జీ5లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్ర‌స్తుతం రాజ్ త‌రుణ్ న‌టించిన తిరగబడరా సామి సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌రో చిత్రం భలే ఉన్నాడే చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉండ‌గా.. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై రాజ్ త‌రుణ్ బిగ్ బాంబ్ పేల్చాడు. ఇటీవల కాలంలో సినీ తరాలు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు పెళ్లి పీటలెక్కిస్తున్నారు. కానీ కొందరు మాత్రం వయసు దాటిపోతున్న పెళ్లి గురించి పట్టించుకోవడం లేదు. పెళ్లెప్పుడ‌ని ప్రశ్నించిన ప్రతిసారి త్వరలో చేసుకుంటా, తొందరేముంది అంటూ మాట దాటవేస్తున్నారు.

ఈ జాబితాలో ప్రభాస్, సాయి ధరమ్ తేజ్, రామ్ ఇలా చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ తనకు పెళ్లి వద్దంటూ షాక్ ఇచ్చాడు. ఈ అందగాడి వయసు 31. అంటే పెళ్లి చేసుకునే వయసు రానే వచ్చింది. కానీ తాను పెళ్లి చేసుకోనని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఏది ఏమైనా సరే జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోను. నాకు పెళ్లి పిల్లలు వద్దు. సింగిల్ గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా ఇంట్లో పెళ్లి పై ఎలాంటి ఒత్తిడి లేదు. మా నాన్న పెళ్లి విషయంలో నా ఇష్టం అంటారు. అమ్మ మాత్రం ఒకప్పుడు ఒత్తిడి చేసేది. కానీ ఇప్పుడు ఆమె కూడా నా ఇష్టమని వదిలేసింది అంటూ రాజ్ త‌రుణ్ చెప్పుకొచ్చాడు.

దీంతో అతని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు రాజ్ తరుణ్ కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు. జీవితాంతం సింగిల్ గానే ఉండావా గురూ అని కొందరు.. ఫ్యూచర్ లో ఇదే మాట మీద నిల‌బ‌డ‌తావా అని మ‌రికొంద‌రు అడుగుతున్నారు. మరి రాజ్‌ తరుణ్ ఇప్పుడు చెప్పినట్లుగా లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటాడా.. లేక న‌చ్చిన అమ్మాయి దొర‌గ్గానే ఆమెతో మింగిల్ అయిపోతాడా..? అన్న‌ది చూడాలి.

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar