NewsOrbit
రాజ‌కీయాలు

రాజకీయాలకు గుడ్‌బై

 

అమరావతి:ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో అనంతపురం జిల్లా సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోమవారం ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రధాని మోదితో జగన్ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రానికి శుభ పరిణామం అని జెసి వ్యాఖ్యానించారు. జగన్‌పై రాజకీయ విమర్శలు చేశాను తప్ప ఎప్పుడూ ద్వేషించలేదనీ,  మావాడనే అభిప్రాయం ఎప్పుడూ ఉందని జెసి అన్నారు.

జగన్ తండ్రి వైఎస్ తనకు చాలా సహాయకారిగా ఉండేవారని తెలియజేస్తూ ఆయన మృతి చెందడానికి ఒక రోజు ముందు తనను పిలిపించి మాట్లాడారనీ, హైకమాండ్‌తో అనుమతి తీసుకువచ్చాననీ, చిత్తూరు పర్యటన నుండి రాగానే తనను, జానారెడ్డిని మంత్రివర్గంలో తీసుకుంటానని వైఎస్ చెప్పారని జెసి అన్నారు.

తమ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల విషయంలో తేడా లేదని జెసి వెల్లడించారు.

‘30-35సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కొన్ని పొరబాట్లు జరిగి ఉంటాయి, కొన్ని మంచి పనులు జరిగి ఉంటాయి, కానీ కక్ష సాధింపుగా ఎవరికి హాని చేయలేదు’ అని జెసి అన్నారు.

‘నా తండ్రి సంజీవరెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చా, నేడు రాజకీయాల్లో ఆ స్పూర్తి కొనసాగే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నా’ అని జెసి వెల్లడించారు.

రాజకీయ వాతావరణం రోజురోజుకు దిగజారిపోతోందని జెసి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు మారాలనీ, ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని జెసి అన్నారు.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

Leave a Comment