NewsOrbit
రాజ‌కీయాలు

బిజెపిలో మాజీ ఎంపీ వివేక్‌!

న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా బిజెపివైపు చూస్తున్న పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ చివరికి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇవాళ ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో వివేక్‌ భేటీ అయ్యారు. తనతోపాటు మరి కొంతమంది నేతలు బిజెపిలోకి వస్తారని వివేక్‌ తెలిపినట్లు సమాచారం.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్న బిజెపి దళిత, గిరిజన సామాజిక వర్గాల్లో బలమైన నేతలపై దృష్టి పెట్టింది.

పార్టీలో చేరిన తర్వాత వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నియంతృత్వ ధోరణిలో నడుస్తున్నారని ఆరోపించారు. ఆయన నియంతృత్వ పోకడకు బిజెపి బుద్ధి చెబుతుందన్నారు. తెలంగాణలో అవినీతి భారీగా పెరిగిపోయిందని, ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా ముఖ్యమంత్రి నెరవేర్చలేదని అన్నారు. నియంతృత్వ పాలన అంతమై ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడాలని ఆకాంక్షించారు.

తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంపైనే సీఎం ప్రధానంగా దృష్టి పెట్టారని వివేక్ వ్యాఖ్యానించారు. గతంలో తనకు పెద్దపల్లి ఎంపీ టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. పార్టీలో బలమైన ఉద్యమ నేతలు ఉండకూడదన్నదే సీఎం ఉద్దేశమని చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాలను చూసి ఇంకా చాలా మంది బిజెపిలో చేరుతారని ఆయన అన్నారు.

Related posts

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

Leave a Comment