పొడవాటి, పట్టు కుచ్చులాంటి , అందమైన జుట్టు మీద ఆశ ఎవరికీ ఉండదు. పొల్యూషన్ , వర్క్ టెన్షన్లు, విశ్రాంతి లేకపోవడం, తీసుకునే ఆహారం వీటిఅన్నిటి వలన జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని చిట్కాలను జాగ్రత్తలను ,పాటించటం ద్వారా జుట్టు రాలే సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు.
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ , తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి జుట్టు సమస్యలను ఎలా తగ్గించవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. వీటికి కొన్ని నీటిని కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని ఫిల్టర్, లేదా శుభ్రమైన కాటన్ క్లాత్‌లో వేసి పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని కాటన్ సాయంతో స్కాల్ప్‌కి అప్లై చేయండి. ఆరిన తర్వాత కేవలం నీటితో కడగండి. తర్వాత రోజు షాంపూతో తలస్నానం చేయండి. అయితే, ఉల్లి వాసన కాస్తా వదలదు. దీంతో కొంత ఇబ్బందిగా ఉంటుంది.
కలబందలో కూడా ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపించడమే కాకుండా జుట్టు రాలడాన్నిఅరికడుతుంది. కాబట్టి ఉల్లిపాయ రసంలో కలబంద గుజ్జుని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేశాక నీటితో కడగండి. దీని వలన మంచి ఫలితం ఉంటుంది.ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని తలకు, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టి 25-30నిముషాల అలాగే ఉంచాలి. దాంతో హెయిర్ ఫాలీ సెల్స్ కు బాగా ప్రసరిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల తల నుండి వచ్చే వాసన శుభ్రంగా తొలగిపోతుంది.