ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ముద్రగడతో సోము వీర్రాజు భేటీ..!బీజెపీ చేరికపై ఎమన్నారంటే..!!

Share

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజెపీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా వివిధ పార్టీలలోని అసంతృప్తి నాయకులకు, ప్రముఖులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఒక పర్యాయం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ను కలిసిన సోము వీర్రాజు నేడు మరో పర్యాయం ఆయనతో భేటీ అయ్యారు. అధికారంలోకి వస్తే కాపులకు బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని ఇప్పటికే బీజెపీ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజెపిలో చేరాలంటూ పలు మార్లు ముద్రగడను సోము వీర్రాజు ఆహ్వానించిన నేపథ్యంలో ఈ రోజు మరో సారి ఆయన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ap bjp chief somu meets mudragada padmanabham

బీజెపీ, జనసేన ఉమ్మడిగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభంతో మర్యాదపూర్వకంగా జరిగిన సాధారణ భేటీ యేనని సోము వీర్రాజు చెబుతున్నా దీనికి రాజకీయ ప్రాధాన్యత ఉందని భావిస్తున్నారు. కొద్ది కాలంగా కాపు ఉద్యమం నుండి కూడా దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ ను బీజెపీ లో చేర్చుకుంటే పార్టీకి మైలేజీ పెరుగుతుందని కమలనాధులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిమాణాల పై ముద్రగడ, సోము వీర్రాజులు చర్చించారని అంటున్నారు.

ap bjp chief somu meets mudragada padmanabham

ఇటీవల కాలంలో సోము వీర్రాజు అధికార వైసీపీపైనా దూకుడు పెంచారు. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఎంపిక అయిన తరువాత ప్రతిపక్ష టీడీపీపైనే ఎక్కువగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు అధికార పక్షంపైనా విమర్శలు చేస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరో పక్క అధికార, ప్రతిపక్ష పార్టీలోని అసంతృప్తులను, మాజీలను, కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న నేతలను బీజెపీలో చేర్చుకోవాలన్న ప్రయత్నంలో సోము ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాగా సోము వీర్రాజు ఆహ్వానంపై ముద్రగడ స్పందన ఏమిటన్నది ఇంత వరకూ బహిర్గతం కాలేదు. అయితే ముద్రగడ త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. బీజెపీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని సోము వీర్రాజు ముద్రగడకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముద్రగడతో భేటీ అనంతరం సోము వీర్రాజు ట్విట్టర్ వేదికగా స్పందన వెల్లడించారు. తమ మధ్య జరిగిన స్నేహపూర్వక బేటీ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ పట్ల ముద్రగడ చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేశారు.


Share

Related posts

Prabhas: డిటెక్టివ్ క్యారెక్టర్ చేయబోతున్న ప్రభాస్..??

sekhar

YS Jagan : జూలు విదిల్చిన జగన్ మోహన్ రెడ్డి – ‘ఏకగ్రీవాల’ టార్గెట్ ఎంతో తెలుసా ? నిమ్మగడ్డ తెలుసుకోవాల్సిన టార్గెట్ ఇది !

somaraju sharma

Ukraine Crisis: ఉక్రెయిన్ నుండి చేరుకుంటున్న తెలుగు విద్యార్ధులు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar