NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని హెచ్చరించిన సీఎం జగన్

Share

చంద్రబాబు ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చుక్కల భూముల రైతులకు పూర్తి హక్కు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న చుక్కల భూముల సమస్యకు సీఎం జగన్ చెక్ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..రిజిస్ట్రేషన్ 22(1)ఏ నుంచి డీనోటిఫై చేశామనీ, దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతు కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. 2,06,171 ఎకరాల భూములకు సంపూర్ణ హక్కులు లభించాయన్నారు. రూ.20 కోట్ల మార్కెట్ విలువైన భూములకు సంపూర్ణ హక్కు లభించిందన్నారు. గత ప్రభుత్వం చుక్కల భూములను నిషేదిత జాబితాలో చేర్చిందన్నారు. చంద్రబాబు హయాంలో ఈ భూమలు అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు చుక్కల భూముల హక్కుతో బ్యాంకు రుణాలు తీసుకోవచ్చనీ, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఇప్పటికే గిరిజనులకు ఆర్ వో ఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశామన్నారు.

AP CM YS Jagan Speech In kavali

 

ఇదే సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై నా మరో సారి విమర్శలు గుప్పించారు. దళారీ వ్యవస్థ లేకుండా చేసి రైతులకు మేలు చేస్తున్నామనీ గతంలో ఎన్నడూ జరగని మంచి ఇప్పుడు రైతులకు జరుగుతోందన్నారు. చంద్రబాబు రైతులను గాలికి వదిలివేశారని విమర్శించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుడు వేషం వేశారని సెటైర్ వేశారు. వారికి తోడు రావణ సైన్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నిలిచాయన్నారు. రూ.87, 612 కోట్లు మాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్తామని చెప్పి మోసం చేసారని అన్నారు.

రైతులను మోసం చేసిన పెద్ద మనిషిని ఒక్క మాట అడగరు అని, ప్రశ్నిస్తామని చెప్పిన వారు ప్రశ్నించడమే మానేశారని పవన్ ను ఉద్దేశించి జగన్ అన్నారు. ఎన్నికల దగ్గరపడుతుండటంతో వీళ్లంతా రొడ్డెక్కారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను డైలాగ్ లుగా మార్చిన ప్యాకేజీ స్టార్ ఒక వైపు.. బాబు, దత్తపుత్రుడి డ్రాలు రక్తికట్టించాలని ఎల్లో మీడియా తానా తందనా అంటున్నాయన్నారు. డీబీటీ ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకూ 2,10 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని అన్నారు. ప్రజలు గత పాలనను, ప్రస్తుత పాలనను బేరీజు వేసుకోవాలని జగన్ సూచించారు.

ఏపి ప్రభుత్వానికి హైకోర్టు మరో ఎదురుదెబ్బ .. జీవో నెం.1ను రద్దు చేసిన హైకోర్టు


Share

Related posts

Voter ID: సింపుల్ గా ఓటర్ కార్డు లో అడ్రస్ మార్చుకోండిలా..!!

bharani jella

Tirupati By election: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ కామెంట్స్

somaraju sharma

Prakash raj: ప్రకాష్ రాజ్‌ని జగపతి బాబు, విజయ్ సేతుపతి డామినేట్ చేస్తున్నారా..అందుకే గతకొంతకాలంగా అవకాశాలు తగ్గాయా..?

GRK