NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Bandi Sanjay : టి‌ఆర్‌ఎస్ నుంచి 18 మంది జంప్ ? బండి దగ్గర ఫుల్ లిస్ట్ ?

Bandi Sanjay : తెలంగాణలో పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అధికార టీఆర్ఎస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం, దుందుడుకు వ్యవహార శైలితో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న బండి సంజయ్ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం బూస్ట్ ఇచ్చింది. ఆ తరువాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే 15 రెట్లు అధికంగా సీట్లు సాధించడంతో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అన్నట్లుగా చెప్పుకొంటోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజెపీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

అయితే బండి సంజయ్ విమర్శలకు టీఆర్ఎస్ పార్టీ నేతల నుండి అంతగా రియాక్షన్ రావడంతో లేదు. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీజెపీ నేతల విమర్శలకు కౌంటర్ లు ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు అంతగా రియాక్ట్ కావడం లేదని ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రధానంగా బీజెపీ అంటే భయంతోనే కొందరు టీఆర్ ఎస్ నేతలు బయటకు రావడం లేదని ప్రచారం జరుగుతుంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజెపీకి భయపడటం ఏమిటని అనుకుంటుండగా పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల నివేదికలు బండి సంజయ్ తెప్పించుకున్నారని అంటున్నారు. ఆ నివేదికల ద్వారా వారిని ఇబ్బంది పెట్టడానికి బండి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని టాక్.

Bandi Sanjay : 18 people jump from TRS? Full list near the bandy ?
Bandi Sanjay : 18 people jump from TRS? Full list near the bandy ?

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల చార్జ్ షీట్ ల పేరుతో వారి అవినీతి అక్రమాలను బయటపెట్టడానికి నివేదికలు తెప్పించుకున్నారని అంటున్నారు. దాదాపుగా 18 మంది అధికార పార్టీల ఎమ్మెల్యే ల డేటా ఇప్పటికే సేకరించారన్న మాటలు వినబడుతున్నాయి. వారు పాల్పడిన అవినీతి అక్రమాలను వారి నియోజకవర్గాల్లో ప్రజలకు వివరించడానికి సిద్ధం చేస్తున్నారుట. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం మొత్తం ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉందట. ఎన్నికల సమయంలో బీజెపీ నేతలు.. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేల వివరాలు చార్జిషీటు రూపంలో జనాల ముందుకు తీసుకువెళితే వారు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. తద్వారా బీజెపి లాభపడాలన్నది ఆలోచన. ఈ విషయంలో వాస్తవం ఎంత ఉందో గానీ ప్రచారం మాత్రం జరుగుతోంది. ఏది ఏమైనా గతంతో పోల్చుకుంటే బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తరువాత బీజెపీ బాగానే పుంజుకుందనే మాట వినబడుతోంది. రాబోయే అసెంబ్లీ నాటికి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N