NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

స్నేహలత ను చంపేసింది పోలీసులే : ఎస్పీ ప్రకటన బాధ్యత రాహిత్యం

 

 

**ధర్మవరం ఘటన అత్యంత పాశవికం… దారుణం.. ప్రేమ పేరుతో వేధింపులు గురిచేసి.. ఒప్పుకోక పోవడంతో నిండు జీవితాన్ని చిదిమేసిన రాజేష్ శిక్షార్హుడు.. గొంతు నులిమి చంపేసిన అనంతరం ఆమె శరీరాన్ని కాల్చాలని అత్యంత క్రూరంగా ప్రవర్తించిన రాజేష్ ఈ కేసులో తెరపైన నిందితుడు అయితే.. తమ బిడ్డను ఓ యువకుడు పదేపదే వేధిస్తున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోవడం కనీసం యువకులు పిలిచి మందలించడం ఈ కేసులో తెరవెనుక పోలీసులు తప్పులు చూపిస్తోంది…

**నిజంగానే మృతురాలు స్నేహలత తల్లిదండ్రులు ఆమెను ఓ యువకుడు వేధిస్తున్నట్లు పోలీసుల వద్దకు వెళ్లారా లేదా అనేది పక్కనపెడితే…. కేసు ప్రాథమిక దర్యాప్తు పూర్తికాకుండానే జిల్లా ఎస్పీ ఏసుబాబు ఇప్పటివరకు స్నేహలత కుటుంబ సభ్యులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పడం నిజంగా అత్యుత్సాహం అని చెప్పాలి.. బాధితురాలి కుటుంబం పోలీసులపై ఆరోపణలు చేసినప్పుడు దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి ఎస్పీ స్థాయి అధికారి వివరణ ఇవ్వాలి… అయితే ఈ కేసులో ఎస్ పి మీడియా కు అడగగానే బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేయలేదని స్థానిక పోలీసులను అడిగి చెప్పడం నిజంగా బాధిత రాహిత్యమే..
** స్నేహలత మృతిచెందిన విషయం తెలుసుకున్న వెంటనే మీడియా వెళ్లగానే బాధితులు మొదట చెప్పిన మాట ఇప్పటివరకూ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, స్నేహలత మీద రాజేష్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని పోలీసులకు చెబితే ఇల్లు మారడానికి మంచి సలహా ఇచ్చారని మీడియా ముఖంగా చెప్పారు… ఇది అసత్య ఆరోపణల అనిపించడంలేదు. ఎందుకంటే బాధితురాలి మృతి చెందిన ఆవేదనలో ఉన్న కుటుంబం మీడియాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు.. పైగా స్థానిక పోలీసులు అన్నట్లుగా ఇల్లు మారమని చెప్పినట్లుగా చెప్పడం కూడా చిన్న విషయంలా అనిపించడం లేదు..
** జిల్లా ఎస్పీ స్థాయి అధికారి స్థానిక పోలీసులను విచారించినపుడు పోలీసులు కచ్చితంగా ఈ విషయంలో తప్పించుకునేందుకు చూస్తారు. తమ వద్దకు రాలేదని ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని చెబుతారు. అయితే దాన్ని లోతుగా దర్యాప్తు చేసి ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన ఎస్పి ముందుగానే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడం బాధితురాలి బంధువులు కుటుంబ సభ్యులను అవమానించడమే… పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా చెబుతున్నారని వారిపై అపవాదు వేయడమే.. ఒకవేళ స్నేహలత కుటుంబ సభ్యులు సైతం ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకున్నా స్పందించాల్సిన తీరు ఇది కాదు… దీనిపై కుటుంబ సభ్యులతో మాట్లాడత మని చెప్పాలి. ఒకవేళ ఇప్పటివరకు స్నేహలత కుటుంబసభ్యులు పలుమార్లు పోలీస్ స్టేషన్కు వచ్చి ఉంటే కనుక దానిపై బాధ్యులపై చర్యలు తీసుకోవడం సరైన చర్య.
** ఇలాంటి కేసులు అదృశ్యం కేసుల్లో పోలీసుల ప్రవర్తన ఇలాగే ఉంటుంది. కేసులు పెద్దవై పోయినప్పుడు దానికి మీడియా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినప్పుడు పోలీసులు బుక్ అవుతున్నారు. సాధారణంగా కేసు నమోదు చేసిన.. లేక బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సదరు ఆరోపణలు చేసిన వ్యక్తిని పోలీస్ పోలీస్ స్టేషన్ కు పిలిచి మందలించడం వారి తల్లిదండ్రులు సైతం పిలిచి కౌన్సిలింగ్ చేయడం చేస్తే… ఈవ్ టీజింగ్ కేసుల్లో మార్పు వస్తుంది. అలాగే అదృశ్యం కేసులో కేసు నమోదు అవుతున్న వాటిని గుర్తించి వాటిని గుర్తించి వెతికే తీరిక పోలీసులకు ఉండడం లేదన్నది వాస్తవం.
** దిశా చట్టాలు అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే… ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతమై ఉంటాయి… ప్రభుత్వానికి చెడ్డ పేరు ఖాయం.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N