Subscribe for notification

CM YS Jagan: పేద బ్రాహ్మణ యువత అభ్యున్నతి కోసం జగన్ సర్కార్ మరో కొత్త పథకం..కార్పోరేషన్ ద్వారా

Share

CM YS Jagan: పేద బ్రాహ్మణ యువత అభ్యున్నతి కోసం బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా జగన్ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్రాహ్మణ సామాజిక వర్గంలో డ్రైవింగ్ వృత్తిలో పని చేస్తున్న బ్రాహ్మణ యువతను స్వయం ఉపాధి లో భాగంగా ప్రోత్సహించేందుకు ఏపి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెటిట్ సొసైటి లిమిటెడ్ సౌజన్యంతో “చాణక్య లఘు పారిశ్రామిక వేత్తల పథకం” రవాణ ఆపరేటర్ (సీఎస్ మెట్రో) ను ప్రవేశపెట్టడం జరిగిందని ఏపి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ నేడొక ప్రకటనలో తెలిపారు.

CM YS Jagan govt new scheme for brahmin youth

CM YS Jagan: రాష్ట్రంలో 26 జిల్లాల్లో వంద వాహనాల కొనుగోలు

నిరుద్యోగ బ్రాహ్మణ యువత స్వయం ఉపాధి నిమిత్తం టాక్సీ క్యాబ్ వాహన కొనుగోలుపై సబ్సిడీతో కూడిన రుణం ఏపి బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రిడిట్ సౌసైటీ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో వంద వాహనాల కొనుగోలుకు కార్పోరేషన్, సొసైటి సంయుక్తంగా కృషి చేస్తాయని చెప్పారు. ధరఖాస్తు నమోదు అనుసరించి మంజూరు చేసే వాహన సంఖ్యలో మార్పు, చేర్పులు ఉండవచ్చని తెలిపారు. వాహన ధరలో పది శాతం లబ్దిదారుడు వాటాగా చెల్లించాల్సి ఉంటుందనీ, కార్పోరేషన్ ద్వారా 25 శాతం సబ్సిడీ పోగా మిలిగిన నగదు సొసైటి ద్వారా రుణం మంజూరు చేయడం జరుగుతుందని, సొసైటి గైడ్ లైన్స్ ప్రకారం రుణాన్ని తిరిగి చెల్లించాలని చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ లోగా WWW andhrabrahmin ap gov in సైట్ కు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు సమర్పించాలని తెలిపారు.

అర్హతలు

 • ధరఖాస్తుదారుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడై ఉండాలి.
 • ధరఖాస్తుదారుడు ఏపి బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటి సభ్యుడై ఉండాలి.
 • దరఖాస్తుదారుడి వయసు 01-04-2022 నాటికి 21 నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి.
 • కనీస విద్యార్హత పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
 • దరఖాస్తుదారు మరియు అతని కుటుంబ వార్షిక ఆదాయం లక్ష పరిమితిని మించరాదు.
 • ధరఖాస్తుదారుని పేరు మీద ఏ విధమైన వాహనము (3,4 వీలర్) రిజిష్టర్ అయి వుండరాదు.
 • ధరఖాస్తు చేసే సమయానికి ధరఖాస్తుదారుడికి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సు, వాలిడ్ బాడ్జ్ నంబర్, లేదా డ్రైవర్ గా పని చేస్తున్నట్లుగా ఐడెంటిటీ ప్రూఫ్ వుండాలి.
 • చాణక్య పథకం కింద కార్పోరేషన్ నుండి ఏదైనా ఆర్ధిక సహాయాన్ని (రాయితీ) వినియోగించుకున్న లబ్దిదారులు, ప్రభుత్వం నుండి ఇదే తరహా ఏదేనీ పథకంలో లబ్దిపొందివున్ననూ ప్రస్తుత పథకంలో అర్హులు కారు.
 • రేషన్ కార్డులో పేర్కొనబడిన మొత్తం కుటుంబానికి ఒక్కసారి మాత్రమే రాయితీ (సబ్సీడీ) మంజూరు చేయబడుతుంది.

దరఖాస్తుదారులు ఈ కింద డాక్యుమెంట్లు స్కాన్ చేసిన ప్రతులను అప్ లోడ్ చేయాలి

 • ధరఖాస్తుదారుని ఆధార్ కార్డు
 • అర్హత గల అధికారి జారీ చేసిన కుల దృవీకరణ పత్రం మరియు ఆదాయ దృవీకరణ పత్రం లేదా ధరఖాస్తుదారుని పేరుమీద మీ సేవ జారీ చేసిన సమీకృత దృవపత్రం (కులం, ఆదయం, నివాసం, పుట్టిన తేదీ ఒకే పీడీఎఫ్ ఫైలులో
 • ధరఖాస్తుదారుని అత్యున్నత విద్యార్హత దృవపత్రం
 • అర్హత గల అధికారి జారీ చేసిన పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సు, బాడ్జ్, ఐడెంటిటీ ప్రూఫ్, పాన్ కార్డు (ఉన్నట్లయితే)
 • పాస్ పోర్టు సైజ్ ఫోటోగ్రాఫ్ (జేపిజి ఫార్మాట్ లో )

Share
somaraju sharma

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

44 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

1 hour ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

5 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

5 hours ago