NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ మాట మాట్లాడితే దాని వెనుకు అనేక విష‌యాలు దాగుంటాయి. కేసీఆర్ అన్నాడంటే ఎంతో కొంత నిజం ఉండ‌క మాన‌దు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్న‌మాట‌లు యావ‌త్ తెలంగాణ స‌మాజాన్ని నివ్వేర ప‌రుస్తున్నాయి. అసలు కేసీఆర్ మాట‌ల్లో మ‌ర్మ‌మేందో ఇప్పుడు ఎవ్వ‌రికి అంతు చిక్క‌డం లేదు. ఆయ‌న ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల‌కు బీ ఫారం ఇచ్చే కార్య‌క్ర‌మం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా కేసీఆర్ పార్టీ శ్రేణుల‌తో మాట్లాడారు. ఎవ్వ‌రు పార్టీని వ‌దిలి పోవ‌ద్దు.. త్వ‌ర‌లో తెలంగాణలో రాజ‌కీయ మార్పులు జ‌రుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 25 మంది నాతో ట‌చ్‌లో ఉన్నార‌ని వ్యాఖ్యానించి సంచ‌ల‌నం రేపారు.

వాస్త‌వానికి ప‌రిస్తితులు చూస్తే అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కోక్క‌రు చేజారుతూ హ‌స్తం గూటికి చేరుతున్నారు. రాజ‌కీయ భీష్ముడు అయిన క‌డియం శ్రీ‌హ‌రి, కే.కేశ‌వ‌రావుతో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో చేరుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యాల్లో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కాని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో మాత్రం ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తున్నాయి.

కేసీఆర్ చేసిన వ్యాఖ్యాల్లో 25మంది ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నారంటే న‌మ్మ‌క‌శ్యంగా లేదని, కేవ‌లం బీ ఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చేజార‌కుండా కాపాడుకునే ప్రయ‌త్నం లో భాగంగానే కేసీఆర్ ఇలాంటి మాట‌లు మాట్లాడి ఉంటాడ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. అదే క్ర‌మంలో కాంగ్రెస్‌లో ఉన్న‌కొంద‌రు మంత్రి పద‌వుల మీద ద్యాస‌తో కూడా పార్టీ మారేందుకు సిద్ద‌ప‌డ్డారో ఏమో అనేది కూడా అనుమానాలు లేక‌పోలేదు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే గెలిచిన ఎమ్మెల్ల్యేలు ఎవ్వ‌రు చే జార‌డం ఆసాధ్యం. ఒక‌వేళ బీ ఆర్ ఎస్ క‌నుక పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మెజార్టీ సీట్లు సాధిస్తే మాత్రం ఎమ్మెల్యేలు రాజ‌కీయ నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడ‌ర‌ని తెలుస్తుంది.

బీజేపీ ఎలాగు తెలంగాణ‌లో పాగా వేయాల‌ని ఊవ్విళూరుతుంది. కాంగ్రెస్‌లో ఉన్న ఎవ్వ‌రో ఒక‌రిని సీఎం చేస్తాన‌ని మాటిస్తే కొంద‌రు కాంగ్రెస్‌ను వీడ‌టం ఖాయం. అందుకే అటు బీజేపీ, ఇటు బీ ఆర్ ఎస్ పార్టీలు ఏవైనా కాంగ్రెస్‌పై చీలిక కోసం పాచిక విసురే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే కేసీఆర్ ఇటు త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప్రయ‌త్నంలో భాగంగానే ఈ ఎత్తుగ‌డ వేశారేమో, లేక నిజంగానే 25మంది ట‌చ్‌లో ఉన్నారేమో.. అది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. అందుకు పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌రువాతే తెలంగాణ‌లో రాజ‌కీయ మార్పులు సంభవించే అవ‌కాశాలు ఉండోచ్చు.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N