ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. పండు వెన్నెల్లో స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణకు సీఎం వైఎస్ జన్మోహనరెడ్డి రావాల్సి ఉండగా, కాలు నొప్పి కారణంగా సీఎం జగన్ పర్యటన రద్దు అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రపున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు.

వరి గింజల కంకులు, ఫల పుష్పాలతో శోభాయమానంగా కళ్యాణ వేదికను అలంకరించారు. ఒంటి మిట్టలో కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరవ రోజు బుధవారం ఉదయం శివ ధనర్బంగాలంకారములో, పురవీధుల్లో సీతారామ లక్ష్మణ సమేత శ్రీరాముడు ఊరేగాడు. భక్తులు అడుగడుగునా స్వామి వారికి కర్పూర హరతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఊరేగింపులో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరో వైపు శ్రీసీతారాముల కల్యాణం శ్రీరామ నవమి నాడు కాకుండా ఒంటిమిట్ట లో చైత్ర పౌర్ణమి రోజు, పున్నమి కాంతుల్లో జరగడం అనవాయితీ. శ్రీరామ నవమి రోజున జరగాల్సిన కళ్యాణం చైత్ర పౌర్ణమి రోజు జరిపించడం ఇక్కడి విశేషం. పగటి వేళ తాను రామ కల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుడికి శ్రీరాముడు మాట ఇచ్చాడని, అందుకే తన కళ్యాణ వేడుక ను చంద్రుడు తిలకించేలా చైత్ర పౌర్ణమి రోజు రాత్రి జరుగుతుందని వరమిచ్చారని పురాణ కథన. మరో కథ ప్రకారం చంద్ర వంశజుడైన విజయనగరరాజు తమ కులదైవానికి తృప్తి కల్గించేలా రాత్రివేళ కల్యాణాన్ని జరిపించేలా ఆచారాన్ని మొదలు పెట్టారని కూడా అంటుంటారు.
Breaking: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ .. ఇక జైలుకే