AP CID Sunil Kumar: శోధన – ఛేదన ఆయన ప్రత్యేకత..! సీఐడీకి ప్రత్యేక గుర్తింపు..!!

AP CID Sunil Kumar: Aa Unique IPS in Department
Share

AP CID Sunil Kumar: పోలీస్ ఉద్యోగమంటే ప్యాషన్ గా ఉండొచ్చు.. ఒంటిపై ఖాకీ.., చేతిలో లాఠీ.., బెల్టుకి గన్నుతో ఠీవీగా తిరగొచ్చు.. సమాజంలో భయంతో కూడిన గౌరవం.., పలుకుబడి.. వస్తే రావచ్చు.. కానీ వాటన్నిటి కంటే పోలీసు ఉద్యోగమంటే నాణేనికి రెండో వైపు యాతన ఉంటుంది..! శోధన – ఛేదనలో ఒత్తిడి ఉంటుంది..! సమాజంలో ఏ ఒక్కరి భావోద్వేగాలు రెచ్చిపోయినా.., కుల మతాలు రెచ్చిపోయిన.., మనోభావాలు దెబ్బతిన్నా.., స్థాయికి, హోదాకి సంబంధం లేకుండా వాటన్నిటికీ జవాబుదారీ పోలీసు..! అటువంటి శాఖలో ఐపీఎస్ అనేది ఉన్నత హోదా.., ఆ హోదాకి న్యాయం చేసి, ఆ స్థాయికి గౌరవాన్ని ఇస్తున్న ఐపీఎస్ లు కొందరే ఉంటారు. వారిలో మన ఏపీ సీఐడీ అదనపు విభాగాధిపతి (సీఐడీ అదనపు డీజీ) సునీల్ కుమార్ ఒకరు.. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.., ఎంత మంది వివాదంలోకి లాగాలని ప్రయత్నించినా.. తాను పట్టుకుని కేసుని మూలాల్లోకి వెళ్లి, శోధనలో ప్రత్యేకమైన శైలి అనుసరించి పూర్తి పారదర్సకతని చూపిస్తారు.. ఆయనపై ఇప్పుడు వివాదాలు ఉంటె ఉండొచ్చు.., నేటి రాజకీయాల్లో నేతలనే కాదు.. పోలీసులు, ఉన్నతాధికారులను కూడా రాజకీయ పావులుగా వాడుకునే క్రమంలో అక్రమ ఫిర్యాదులతో మానసికంగా కుంగదీసి ప్రయత్నం చేస్తారు. వాటిని ఎదుర్కొనే సమర్ధత, ఛేదన శక్తి సునీల్ కుమార్ లో పుష్కలంగా ఉంది..

AP CID Sunil Kumar: Aa Unique IPS in Department
AP CID Sunil Kumar: Aa Unique IPS in Department

AP CID Sunil Kumar:  సీఐడీకి ప్రత్యేక గుర్తింపు..!

నేర శోధనలో ఒక్కొక్కరిదీ ఒక్కో పద్ధతి.. ఏపీ సీఐడీకి సునీల్ కుమార్ బాస్ అయిన తర్వాత సీఐడీలో ఛేదన – శోధన సామర్ధ్యం పెరిగింది. ఏపీ సీఐడి అంటే దేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 2019 – 20.., 2020 – 2021 కి గాను ఏపీ సీఐడీ జాతీయస్థాయిలో స్కాచ్ అవార్డులు కూడా అందుకుంది. అత్యధిక కేసులను సులువుగా ఛేదించిన విభాగంగా నిలిచింది. అలా గడిచిన రెండేళ్లలో సీఐడీకి ప్రత్యేకత తీసుకొచ్చి.. తన సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఘనత సునీల్ కె దక్కుతుంది. ఇటీవల కరోనా వాక్సిన్ సమయంలో కూడా రాష్ట్రంలో ఏ అధికారి ముందుకు రాకమునుపే తన నెలరోజుల వేతనాన్ని ఉచిత వాక్సిన్ పంపిణీకి ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేసారు.

* సీఐడీ విభాగాధిపతిగా ఆర్ధిక నేరాలు, గత ప్రభుత్వ కుంభకోణాలు, రాజకీయ అవినీతి అన్నిటినీ మూలాల్లోకి వెళ్లి శోధిస్తున్నారు. దేశంలోనే ఏపీ సీఐడీ ఛేదిస్తున్నన్ని కేసులు ఏ రాష్ట్ర సీఐడీ చేయడం లేదు.

* వివాదాలు సహజమే అన్నట్టు.. ఆయనపై ప్రత్యర్థి పార్టీలు కన్నేశాయి. ఎలాగైనా వివాదాల్లోకి లాగాలని ఫిర్యాదులు చేస్తున్నాయి. వీటికి సిద్ధపడిన ఆయన వాటిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాలని సులువుగా పరిష్కరించుకుని, పూర్తి స్పష్టత ఇచ్చారు.

AP CID Sunil Kumar: An Unique IPS
AP CID Sunil Kumar: An Unique IPS

* తాజాగా సునీల్ కుమార్ కి సహచరులు, విద్యావంతుల నుండి మద్దతు అందుతుంది. తెలంగాణ క్యాడర్ కి చెందిన ఐపీఎస్ అధికారి ఆరెస్ ప్రవీణ్ కుమార్ సునీల్ కి బాసటగా నిలిచారు. “సునీల్ కుమార్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఐపీఎస్ సర్వీస్ కి అత్యున్నత స్థాయి తీసుకొచ్చిన వ్యక్తి. ఆయనను వివాదాల్లోకి లాగడం గర్హనీయం” అంటూ తన మద్దతు తెలిపారు. జాతీయ స్థాయిలోనూ పలువురు ఐపీఎస్ లు, ఉన్నత ఉద్యోగులు సునీల్ కు బాసటగా నిలుస్తున్నారు.
* తాజాగా ఆయనపై లీగల్ రైట్స్ ఒబ్జేర్వేటరీ చేసిన ఫిర్యాదులో సీరియస్ గా పరిగణించదగిన అంశాలు ఏమి లేవని.., సునీల్ కుమార్ ఈ వివాదాల నుండి పూర్తి స్వచ్చతతో బయటపడతారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..!


Share

Related posts

చంద్రబాబు కి వచ్చిన కష్టమే జగన్ కీ వచ్చింది!

CMR

‘అచ్చెన్న అవినీతికి లేఖే సాక్ష్యం’

somaraju sharma

సుకుమార్ విజయ్ దేవరకొండ ఇమేజ్ మార్చేస్తే రచ్చ రచ్చే ..?

GRK