Devatha Serial: మాధవ్ గొడవ పడి వెళ్ళాకా ఆదిత్య డాక్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది.. ఆదిత్య గారు మీరు మీ ఆవిడ విషయం గురించి ఎవరికీ తెలియకూడదు అన్నారుగా ఇప్పుడు వాళ్ళకే తెలిసిపోయింది అని చెబుతుంది.. మా ఆవిడ నా దగ్గరే ఉంది వచ్చింది ఎవరో సరిగ్గా తెలుసుకున్నారా అని అడగగా.. తనకి చదువు రాదు అని చెప్పగానే.. వచ్చింది రాధ అని తెలుసుకుని రాధను కలవడానికి ఆదిత్య వెళతాడు..
రాధ ఇంటికి వెళ్తుండగా ఆదిత్య ఆగి రాధ వెళ్లే ఆటో ను ఆపుతాడు. సత్య మాకు పిల్లలు పుట్టరని నీతో చెప్పిందా.. హ.. మీలో లోపం ఉందని అంది.. రుక్మిణీ ఉంటే ఆ లోపం లేకుండానే నేను తండ్రి అయ్యేవాడిని.. తనకు సత్యకు పిల్లలకు సంబంధం ఏమిటి అని ఏమీ తెలియని అమాయకురాలులా అడుగుతుంది. రుక్మిణీ చనిపోయే ముందు గర్భవతి అని తనే ఉంటే ఇప్పుడు తను తండ్రి అయ్యేవాడినని.. తను సత్య కు దురమయ్యి ఏ ఆనందం ఇవ్వాలి అనుకుందో అది జరగలేదని.. వాళ్లిద్దరి వలన మధ్యలో తను నరకం అనుభవిస్తున్నాని చెప్పేస్తాడు..
ఆదిత్య మాటలు విన్న రాధ పెనిమిటి నిజం తెలిసిపోయిందా.. ఈ విషయం తన బాబయి కి మాత్రమే తెలుసు కదా.. అదిత్యకు ఎలా తెలిసింది.. దేవి తన కన్న కూతురు అని తెలిస్తే తన నుండి తీసుకువెళ్తడా అని అనుకుంటుండగా నేటి ఎపిసోడ్ ముగిస్తుంది.. ఈ ప్రశ్నలకి సమాధానాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..