ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవి మీద తనకేం హక్కుందో రాధకు తేల్చి చెప్పిన ఆదిత్య..!! తన కన్నకుతూరే అని చెప్పేశాడా..!?

Share

Devatha Serial: దేవి చేతిలో ఏదో ఫోటో పెట్టుకొని దానికి ముద్దులు పెడుతూ ఉంటుంది.. రాధా అది ఆదిత్య ఫోటో నేమో అనుకొని నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చలేదు దేవి అంటుంది .. తీరా ఆ ఫోటో చూస్తే అది రాధ దేవిలది.. రాధ దేవిని ఒకవేళ ఆఫీసర్ సార్ రమ్మంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని ప్రశ్నిస్తుంది.. నువ్వేమైనా పిచ్చిదానివా.. ఆఫీసర్ సార్ ఏమన్నా మా నాన్న వెళ్ళిపోవడానికి అంటుంది దేవి..!! అంటే ఒకవేళ మీ నాన్న అయితే వెళ్ళిపోతావా అని మనసులో అనుకుంటుంది.. మరి రాధ ఏం చేసిందంటే..

Devatha Serial: Today Episode Highlights
Devatha Serial: Today Episode Highlights

దేవి చెప్పిన సమాధానంతో రాధా వెంటనే వెళ్లి ఆదిత్య తో మాట్లాడాలి అని ఆదిత్య ను కలవడానికి వెళుతుంది. మీరు దేవి తో మాట్లాడటం నాకు ఏం నచ్చలేదు.. మాట్లాడొద్దు అని చెప్తుంది. ఆదిత్య నువ్వేమైనా అడుగు రాధ ఆ ఒక్కటి అడక్కు అంటాడు. అయినా దేవికి నీకు ఏం సంబంధం ఉంది.. ఏం హక్కు ఉందని నువ్వు దేవిని కలవడానికి అనడంతో.. కోపం వచ్చిన ఆదిత్య నాకు హక్కు ఉంది.. ఏం హక్కు ఉంది అని రాధ అనడంతో.. దేవికి నువ్వు జన్మనిస్తే.. నేను పునర్జన్మ ఇచ్చాను.. పునర్జన్మను ప్రసాదించిన ఆ హక్కుతోనే దేవిని కలిసే హక్కు నాకు ఉంది అని ఆదిత్య రాథ తో చెప్తాడు. దాంతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది రాధా.. అది చూసిన వాళ్ళ బాబాయి ఏంటి రామ్మూర్తి గారు కూడా ఇటువైపు వచ్చి వెళ్లినట్టుంది అని అడుగుతాడు. అలా మాటలు జరుగుతూ ఉండగా.. నాకు కొంచెం డబ్బు కావాలి ఆదిత్య అడిగి డబ్బులు తీసుకుని వాళ్ళ బాబయి అక్కడనుంచి వెళ్ళిపోతాడు..

Read More: 22Jan2022 Intinti Gruhalakshmi: తులసి మారిపోయిందనడానికి సాక్ష్యం ఇదిగో..!! చివరికి నందుని కూడా క్షమించలేదుగా..!! 

Devatha Serial: Today Episode Highlights
Devatha Serial: Today Episode Highlights

మరోవైపు సత్య ఆదిత్య పిల్లలను చూడడానికి రావడానికి ఒప్పుకోమని మాధవను అడుగు డానికి వస్తుంది. మాధవ్ తన పిల్లలు ను చూడటానికి, మాట్లాడడానికి ఆదిత్య రావటం తనకు ఇష్టం లేదని.. ఆదిత్య వస్తే ఊరుకోనని సమాధానం మరోలా చెబుతానని తేల్చి చెబుతాడు. సత్యకి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటుంది. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.


Share

Related posts

Revanth Reddy: విశాఖ ఉక్కుపై తెలంగాణలో పోరు..! కేటీఆర్ పై రేవంత్ సెటైర్లు..!

Muraliak

YS Jagan Sharmila: జల జగడం పంచాయతీలో చంద్రబాబుపై జగన్…కేసిఆర్ పై షర్మిల హాట్ కామెంట్స్

somaraju sharma

Old Coins and Notes : పాత నోట్లు, కాయిన్లు మార్చుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఇది చూడండి!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar