Pawan kalyan: షార్ట్ ఫిలింస్ తీసి ఆకట్టుకున్న సుజీత్ ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ లో రన్ రాజా రన్ సినిమాను తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్ సాధించింది. దాంతో ఏకంగా ప్రభాస్ హీరోగా సాహో సినిమా చేసే అవకాశం అందు కున్నాడు సుజీత్, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ లాంటి స్టార్‌ను అది కూడా పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కించే అవకాశం అంటే ఇంతకంటే అదృష్ఠం మరొకటి ఉండదు. ఇలాంటి అవకాశం మరో దర్శకుడికి దక్కదు. అందుకే సుజీత్ కూడా ఎంతో కష్టపడి సాహో సినిమాను హాలీవుడ్ రేంజ్లో తీశాడు.
కానీ, కథే కొత్తది కాదు. అక్కడే సుజీత్‌కు విమర్శలు వెల్లువెత్తాయి. దర్శకుడిగా మేకింగ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఇలాంటి సినిమాలు బాలీవుడ్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. దాంతో సాహో సినిమాను అందరూ తిప్పికొట్టారు. ప్రభాస్‌కు సౌత్‌లో భారీ ఫ్లాప్ తప్పలేదు. సాహో ఒక్క బాలీవుడ్లో తప్ప మిగతా అన్నీ భాషల్లో నిర్మాతకు భారీ నష్ఠాలను తెచ్చిపెట్టింది. అంతే, మళ్ళీ సుజీత్‌కు సినిమా చేసే అవకాశం రాలేదు. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోయింది.
Pawan kalyan: దర్శకుడుగా సుజీత్‌ను ఎంచుకున్నారట.
మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లూసీఫర్ సినిమాను చిరంజీవి గాడ్ ఫాదర్‌గా చేస్తున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ముందు సుజీత్కే వచ్చింది. మూడు నెలలు స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు. కానీ, సుజీత్ తెలుగు వెర్షన్‌కు చేసిన మార్పులు చిరుకు నచ్చలేదు. దాంతో నైస్‌గా తప్పించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సుజీత్కే సినిమా దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. తమిళ హిట్ సినిమా వినోదాయ సితం సినిమాను పవన్ రీమేక్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి త్రివిక్రం స్క్రిప్ట్ అందిస్తుండగా..దర్శకుడుగా సుజీత్‌ను ఎంచుకున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ మెగాస్టార్ రిజెక్ట్ చేసిన ఈ దర్శకుడిని పవన్ ఎలా ఆఫర్ ఇచ్చాడు అని మాట్లాడుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!