Silver: ఒక వ్యక్తి జాతకంలో ఏదైనా దోషం ఉండి, దాని కారణంగా అతను ఏ పనిలో విజయం సాధించలేకపోతే వెండి కంకణం అతనికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం వెండి కంకణం మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ప్రజలు ఫ్యాషన్ లేదా అభిరుచి కోసం వారి చేతులకి వెండి గాజులను ధరిస్తూ ఉంటారు..అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి అనేది ఒక వ్యక్తి జాతకంలో ఏ పని చేయలేక.. ఒక వేళ చేసినా దోషం కారణంగా ఆ పనిలో విజయం సాధించలేక పోతే, వెండి కంకణం ధరించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

సిల్వర్ బ్రాస్లెట్ :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి వెండి కంకణం ధరిస్తే, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అదేవిధంగా పెద్ద వెండి కంకణం ధరించడం వల్ల చంద్ర, శుక్ర గ్రహాలు రెండు బలపడతాయి. మీ జాతకంలో చంద్రుడు మరియు శుక్రడు బలహీనంగా ఉన్నట్లయితే, మీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి కంకణం ధరించడం వలన చంద్రుని అన్ని దోషాలు తొలగిపోతాయి అంతే కాకుండా ఒక వ్యక్తి మనసుకు ఏకాగ్రత కూడా లభిస్తుంది.
ఇంకా వెండి ఒక చల్లని లోహం.. దానిని ధరించడం వల్ల ఒక వ్యక్తి మనసును ప్రశాంత పరుస్తుంది. ఇది జీవితం నుండి ప్రతికూలతను కూడా తొలగిస్తుంది.
అయితే జాతకంలో విగ్రహాల స్థానాలను తెలుసుకొని, నిపుణులను సంప్రదించిన తర్వాతే వెండి గాజులు ధరించాలని గుర్తించుకోండి. అలా చేయడం ద్వారా అతను ఏ పనిలో విజయం సాధించలేక పోతే వెండి కంకణం అతనికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది..