నెమలి అంటే ఇష్టపడని వారు ఉండరు. నెమలి పించాన్ని చూస్తే ఆనందం కలుగుతుంది. ఇక నెమలి నాట్యం ప్రకృతిలో అద్భుతాలలో ఇది ఒకటి. అలాంటి నెమలి పించాన్ని ఇంట్లో ఉంచుకుంటే లాభాలు ఉంటాయి అంటే చాలామందికి ఈ విషయం తెలియదు. పెద్దలు చెప్పిన నెమలి పించం విశేషాలు తెలుసుకుందాం…
నెమలిని స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీకగా పురాణాలలో చెప్తారు. శ్రీకృష్ణపరమాత్ముడు నెమలి పించాన్ని ధరించి ఉంటారు. ఇక కుమారస్వామి వాహనం నెమలి. ఇలా దేవుళ్లతో ముడిపడి ఉన్న జీవి నెమలి. పిల్లలు చదువు బాగా రావాలని పుస్తకాలలో పెట్టుకునే వారు పూర్వం. దీనివల్ల చదువుల్లో వెనుకబడే విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారని విశ్వాసం. రాత్రి పూట నిద్రించేటప్పుడు దిండు కింద నెమలి ఫించాన్ని పెట్టుకుంటే ఆర్థిక, ఆరోగ్య సమస్యలు పోతాయి. పీడకలలు రావని పురాణాలలో ఉంది. ఇంట్లో బెడ్రూంలో తూర్పు లేదా ఈశాన్య మూలలో నెమలి ఫించాన్ని పెట్టుకుంటే.. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయట. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారట. అలాగే ఏవైనా పనులు పెండింగ్లో ఉంటే త్వరగా కంప్లీట్ అవుతాయని నమ్ముతారు చాలామంది. వినాయకుడి విగ్రహం లేదా చిత్రపటం ఎదురుగా నెమలి ఫించం ఉంచితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ పోతాయట.
అయితే నెమలి పించం కోసం నెమలిని హింసించరాదు. అడవిలో ఆడుతూ పాడుతూ ఉంటే నెమలి ఈకలు ఊడిపోతాయి. వాటిని మాత్రమే స్వీకరించాలి. అంతేకాని నెమలికి ఎటువంటి అపకారం చేయకూడదు. రాజ్యాంగం రీత్యా నెమలి జాతీయపక్షి. దీనికి ఎటువంటి హాని కలిగించినా నేరంగా పరిగణించబడుతుంది అనే విషయాన్ని గ్రహించండి.