Ganesh Jayanti 2023: ప్రపంచ వ్యాప్తంగా హింధువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు వినాయకుడు. విఘ్నాలకు అధిపతిగా గణపతి దేవుడికి తొలి పూజ నిర్వహిస్తారు. వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు ఇలా అనేక పేర్లతో గణపతి దేవుడికి పూజలు చేస్తుంటారు. హిందువులు పూజించే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలలోనూ అన్ని ప్రాంతాల్లోనూ గణపతి దేవుడు ప్రముఖంగా ఉంటారు. శైవం, వైష్ణవం, శాక్లేయం, జైనం, బౌద్దంలో, భారతదేశం వెలుపల చైనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండోనేషియా వంటి దేశాల్లోనూ వినాయకుడిని పూజిస్తుంటారు.
ప్రతి ఏటా మాఖ శుక్ల చతుర్ధిని వరద చతుర్ధి లేదా గణేశ జయంతిగా జరుపుకుంటారు. ఇవేళ (జనవరి 25) వినాయకుడి జన్మదినం. మహారాష్ట్రలో గణేశ్ జయంతి ఒక ప్రసిద్ధ పండుగ, ఇక్కడ తిల్కుండ్ చతుర్ధి అని కూడా అంటారు. పంచాంగం ప్రకారం మాఘ మాసం శుక్ల పక్ష చతుర్ధి రోజు గోవాలో కూడా గణేశ జయంతిని విశేషంగా జరుపుతారు. గణేశ జయంతి రోజున నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానమాచరించి పసుపు గణపతిని పూజించి, పగలంతా ఉప వాస దీక్షను చేపట్టి రాత్రికి షడ్రసోపేతమైన విందును ఆరగిస్తారు. సకల విఘ్నాలనూ తొలగించే వినాయక పూజను భక్తులు నేడు శ్రద్దతో నిర్వహిస్తారు. ఈ రోజు వినాయకుడిన ప్రార్ధించడం వల్ల సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, కీర్తి, సంపదన ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మిక.
వినాయక జయంతి, వినాయక చవితి పండుగల మధ్య వ్యత్యాసం ఏమిటంటే.. వినాయక చవితి పండుగను బాధ్రపద మాసం శుక్ల చతుర్ధి (ఆగస్టు, సెప్టెంబర్) లో జరుపుకుంటారు. మరో సంప్రదాయం ప్రకారం వినాయక చవితి పండుగ కూడా మాఖ మాసం శుక్ల చతుర్ధి నాడు వినాయకుడి పుట్టిన రోజుగానే పరిగణిస్తుంటారు. విఘ్నాలు తొలగించే దేవుడుగా, విద్యా బుద్ది ప్రదాతగా ధార్మిక, లౌకిక కార్యక్రమాలైన వ్రతములు, యజ్ఞాలు, యాగాలు, పరీక్షలు వ్రాయడం, ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాల ఆరంభంలో వినాయకుడిని పూజించే ఆనవాయితీ ఉంది. ఈ పండుగను ఉత్తరప్రదేశ్ లో తిలో చౌత్ లేదా సకత్ చౌతీస్ అని కూడా పిలుస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను తొమ్మిది రోజుల పాటు గణేశ్ నవరాత్రి ఉత్సవాలుగా ఘనంగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్ధి నాడు నుండి వివిధ రూపాల్లో గణనాధుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నిమజ్జోత్సవాన్ని నిర్వహిస్తారు.