NewsOrbit
దైవం

Uttara Phalguni Nakshatra born characteristics and features: మీరు ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులా..అయితే ఈ వివరాలు తెలుసుకోండి

Uttara Phalguni Nakshatra born characteristics and features: ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా పేర్కొంటారు. నక్షత్రములలో ఇది 12వదిగా చెప్పబడుతోంది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. అధి దేవత ఆర్యముడు. గణము మనుష్య. రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు. జంతువు.. గోవు. ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో ధనసురాశి, రెండవ పాదములో మకరరాశి, మూడవ పాదములో కుంభరాశి, నాలుగవ పాదములో మీనరాశి.

Important Information for Uttara Phalguni Nakshatra peoples

ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో జన్మించిన వారికి ఆరు నుంచి పదహారు సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ, 16 నుంచి 23 సంవత్సరాల వరకు కుజ మహర్దశ, 41 నుంచి 57 సంవత్సరాల మధ్యలో గురు మహర్ధశ, 57 నుంచి 76 సంవత్సరాల మధ్య శని మహర్ధశ, 76 సంవత్సరాల తర్వాత బుధ మహర్ధశ నడుస్తుంది. ఉత్తర ఫల్గుణీ రెండవ పాదము జాతకులకు తొలి 4 సంవత్సరాల ఆరు నెలల నెలల వరకు రవి మహర్దశ, 14 సంవత్సరముల 6 నెలల వరకు చంద్ర మహర్దశ, ఆ తర్వాత 14 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 21 సంవత్సరముల 6 నెలల వరకు కుజ మహర్దశ, ఆ తర్వాత 39 సంవత్సరముల 6 నెలల వరకు రాహు మహర్దశ, అనంతంర 55 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్దశ, తదుపరి 74 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్దశ నడుస్తుంది. ఉత్తర ఫల్గుణీ నాలుగవ పాదములో జన్మించిన జాతకులకు ఒక సంవత్సరం 6 నెలల వరకు రవి మహర్దశ, ఆ తర్వాత 11 సంవత్సరాల 6 నెలల వయస్సు వరకు చంద్ర మహర్దశ, ఆ తర్వాత 18 సంవత్సరాల 6 నెలల వరకు కుజ మహర్ధశ, 26 సంవత్సరాల 6 నెలల వరకు రాహు మహర్దశ, 32 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్ధశ, 71 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్ధశ నడుస్తుంది.

నక్షత్ర జాతకుల గుణగణాలు

ఈ నక్షత్ర జాతకులకు సకాలంలో వివాహం అవుతుంది. భార్య ఆధిపత్యం అధికం. అదృష్టానికి దగ్గరగా జీవితము కొనసాగుతుంది. ఈ జాతకులు ముఖ్యంగా తండ్రి వలన ప్రయోజనాన్ని పొందుతారు. సంపాదనలో పొదుపు చేస్తారు. నైతిక బాధ్యతతో వ్యవహరిస్తారు. ఇక వైవాహిక జీవితంలో సంతానము వల్ల చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. పైకి గంభీరంగా కనబడుతున్నా లోలోపల పిరికితనం ఉంటుంది. ఈ జాతకులకు రాజకీయ, వ్యాపార రంగాలు కలసి వస్తాయి.  రాహు, గురు దశలు వీరికి మేలు చేకూరుస్తాయి. ఉత్తర ఫల్గుణీ జాతకుల అదృష్ట రాయి కెంపు.అనుకూలమైన రంగులు ఎరువు, కుంకుమ, ఆకుపచ్చ. వీరికి చితత్త, విశాఖ, జ్యేష్ఠ ప్రతికూల నక్షత్రాలు. కావున వీరు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉంటే మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా ఈ నక్షత్రాలకు చెందిన వారితో వివాహా సంబంధాలు కలుపుకోవడం కూడా మంచిది కాదని చెబుతుంటారు.

Rohini Nakshatra Taurus Zodiac Sign: రోహిణి నక్షత్రం వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju