తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ !

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 30వ తేదీ సోమవారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

రాత్రి 7 నుండి 8.30 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా, 2021 జనవరి 28న పుష్య మాస పౌర్ణమి గరుడసేవ, 2021 ఫిబ్రవరి 27న మాఘ మాస పౌర్ణమి గరుడసేవ జరుగనున్నాయి.