Mirror: సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని అందరూ నిర్మించుకుంటూ ఉంటారు కానీ ఆ వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను కూడా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఇష్టానుసారంగా వస్తువులను పెడుతూ ఉంటారు. అయితే అది వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదు అని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరైతే ఇంట్లో అద్దం ఏ దిక్కున ఉంటే ఆ ఇంటికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం. అద్దాలు ముఖాన్ని చూడడానికే కాకుండా ఇంటిని అలంకరించుకోవడానికి కూడా ఎంతో సహాయపడతాయి.

ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో అద్దాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇంట్లో ఉంచిన అద్దాలను సరైన దిశలో ఉంచాలి. ఎందుకంటే అద్దాలు సానుకూల లేదా ప్రతికూల శక్తికి మూలం కావచ్చు. అందువల్ల అద్దాలు ఏ దిశలో ఎలా ఉంచుకోవాలో కచ్చితంగా తెలుసుకోవాలి అద్దాన్ని ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణం మరియు పడమర దిశలో వుంటే తీసివేయాలి.
మీ ఇంట్లో ఈ దిశలలో గాజు ఉంటే వెంటనే దాన్ని తీసివేయండి ..ఎందుకంటే ఈ దిక్కుల్లో అద్దం పెడితే ఆ ఇంట్లో కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంటి సభ్యుల మధ్య విభేదాలు పెరిగి రోజురోజుకు ఇంట్లో గొడవలు జరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన గాజులు ఇంట్లో ఎప్పుడు ఉండకూడదు . అలాగే ఎప్పుడూ పగిలిన అద్దంలో ముఖం చూడకూడదు. పగిలిన దాన్ని ఇంట్లో వాడితే.. ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నిండిపోయి ఆ ఇంట్లో ఉన్నవారు దేనిలోనైనా అభివృద్ధికి నోచుకోకుండా అడ్డంకులు ఎదుర్కొంటారు.
రియర్ వ్యూ అద్దం ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండాలి. మీ ఇంట్లో వాష్ బేస్ దగ్గర గ్లాస్ పై నీటి మరకలు పడితే ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి ఆ శక్తి గాజు పలకలపై ప్రవహిస్తుంది. ఉదయాన్నే నిద్ర లేచి పడక గదిలో ఉన్న అద్దాన్ని చూడకూడదు. బాత్రూంలో కూడా అద్దాలు ఉండడం అంత మంచిది కాదు.