Memory: పొరపాటున కూడా
ఎవరైనా చనిపోయినప్పుడు బంధువులను పిలిచి పెద్ద కర్మ జరిపించి చనిపోయిన వారి జ్ఞాపకార్ధం ( memory) ఎవరి స్థాయి బట్టి వారు ఎదో ఒక వస్తువును ఇవ్వడం జరుగుతుంది. రాను రాను ఈ ఆచారం బాగా పెరిగింది. అయితే ఇలా పంచిన వస్తువులు ఇంటికి తెచ్చుకుని వాడుకునే వారు కొందరు.. పక్కన పెట్టేసేవారు కొందరు ఉంటున్నారు. అంతే కాదు ఈ వస్తువులను పొరపాటున కూడా పూజలలో ,పుణ్యకార్యాలలో వాడకూడదు అనే నియమం కూడా ఉంది. కాబట్టి కొందరు అసలు ఇంట్లోకి కూడా తీసుకు వెళ్ళారు. లేదంటే కొన్ని వస్తువులు అయ్యేవరకు ఉంచి మార్చేస్తుంటారు కానీ వాడరు.
ఇలా చేయడం వలన అది జ్ఞాపకార్ధం ఎలా అవుతుంది? మరణించిన వారి జ్ఞాపకం గా ఇంకా ఉపయోగపడే పని ఏదైనా చేయగలమా అని ఒకసారి ఆలోచించండి… గవర్నమెంట్ స్కూల్స్ లో,ఉచిత వసతి కల్పించే వృధాశ్రమాల లో ,అనాథ శరణాలయంలో కనీస సదుపాయాలు లేక ఎందరో వృద్దులు ,రేపటి పౌరులు ఎన్నోవిధాల ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఒక్కసారి అలాంటి చోటుకి వెళ్లి మీ ఆత్మీయుల జ్ఞాపకార్ధం వారి కి సహాయం చేయండి. అలాంటి వారికోసం ఫ్యాన్ల్ ,టేబుల్స్ ,మరుగు దొడ్లు,బట్టలు ,దుప్పట్లు ,నీడని ఇచ్చే షెడ్ , ఇలా వారికీ ఉపయోగపడి వారు సంతోషించే ఎదో ఒక పని చేయండి. అప్పుడే మీరు మీ ఆత్మీయులకు ఇచ్చే జ్ఞాపకార్ధం అనే దానికి అస్సలైన అర్ధం వస్తుంది.
అలాంటి చోట చేసే ఏపని అయినా ఎందరికో ఆసరా అవుతుంది. వాడకుండా పక్కన పెట్టేసే వస్తువులను ఇస్తారో ,మీరు ఇచ్చిన వస్తువులను అపురూపం గా వాడుకునేలా చేస్తారో ఇక మీ ఇష్టం. జ్ఞాపకార్ధం పంచక పొతే చుట్టాలు తక్కువగా అనుకుంటారు అని ఆలోచించకండి… మీరు చేస్తున్న మంచి పని వారికీ కూడా చెప్పడం వలన వారు సంతోషించడం తో పాటు అదే దారిలో వారు వెళ్తారు. దయ చేసి ఈ విషయాన్ని అందరికి తెలియచేసి.. జ్ఞాపకార్ధనికి ఒక అర్ధం తీసుకురండి.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం `కార్తికేయ 2`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ…
ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…
మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…
`భీష్మ` తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్గా `మాచర్ల నియోజకవర్గం`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…
ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…