దైవం

Gold: మీకున్న బంగారం ఎప్పుడు తాకట్టులోనే ఉంటుంది అని బాధ పడుతున్నారా ?ఈ చిన్న పరిహారం చేసుకోండి!!

Share

Gold: 1.బయటకు  వెళ్లి ఇంట్లోకి వచ్చేముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు. ఒక పక్కగా విడిచి పెట్టాలి.

2.గణపతి కి మన మీద ప్రీతి కలిగింది అంటే మన పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం గా కొనసాగుతాయి. ఆయన ప్రీతి కొరకు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు  పిల్లలకు  తియ్యని పదార్ధాలు  పంచండి.

3.మీరు  ఎలాంటి  పొదుపు మొదలు పెట్టాలనుకున్న..  భరణీ నక్షత్రం  ఉన్న రోజు  చూసుకుని  చేయండి.

4.ఒక ఎర్ర గుడ్డ తీసుకుని అందులో  కొన్ని బియ్యం పోసి  మూటగట్టి  వంటగదిలో  ఎక్కడైనా  ఒక స్వస్తిక్ గుర్తు  వేసి ఆ మూట అక్కడపెట్టడం వలన  ధన ఆవాహనం జరుగుతుంది.

5.ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ  భార్యభర్తల మధ్య కానీ ఎడబాటు వస్తే వెంటనే పిల్లలకు స్వీట్లు  పంచిపెట్టండి. పరిస్థితి చక్కబడుతుంది.

6.బంగారం ఎప్పుడూ తాకట్టులోనే ఉంటుంది అని బాధ పడుతున్నారా ? అయితే పిసరంత మాత్రమే  బంగారాన్ని తీసుకుని పుట్టలో వేసి  పూజిస్తే సమస్య తీరుతుంది.

7.చిన్నపిల్లలు రాత్రిళ్ళు జడుసుకుంటు నిద్రనుండి మెల్కుంటుంటారు.అలా జరుగుతున్నప్పుడు వారు పడుకునే    తలగడ వైపు ఒక నిమ్మకాయను పెట్టండి.

8.ఇంట్లో  అమ్మవారికి   ఎలాంటి పూజ  చేసిన నైవేద్యం  తో పాటు తాంబూలం కూడా   తప్పనిసరిగా  పెట్టండి.

9.  ఈశాన్య గదిలో ఉన్న ఈశాన్యమూలగణపతి   ప్రతిమ లేదా ఫోటోలు  పెట్టకుండా ఉండడం మంచిది.

10.చాలా సార్లు పిల్లలు గోడలపై పెన్సిలు,బొగ్గు గీతలు గీయడం జరుగుతుంటుంది.  ఈ గీతల వలన  అప్పులపాలయే   ప్రమాదం కూడా ఉంది.అలాగని పిల్లలని  కోప్పడకుండా వారు గీసుకోవడం కోసం వేరే ఏదైనా బోర్డు ఏర్పాటు చేసి అక్కడమాత్రమే రాసుకోమని చెప్పాలి.
ఇంట్లో వంట చేయడం  పూర్తయిన తర్వాత  ఆ వండిన వాటినుండి మొదటిముద్ద   కాకులకు ఆవుకి ,కుక్కకి ఇలా ఎదో ఒకదానికి కోసం అని    తీసి పక్కన పెట్టండి.
11.  రెండు గోమతిచక్రాలను తీసుకుని  బీరువాలోలేదా  పర్సులో    పెడితే ధనాభివృద్ధి జరిగి  ఎప్పుడూ ధనానికి లోటు అనేది ఉండదు.
12. రెండు గోమతి చక్రాలను తీసుకుని భార్యాభర్తలు నిద్రించే
పరుపు  లేదా  దిండు క్రింద కానిపెడితే  వారిద్దరి  మధ్యా ఎలాంటి  గొడవలు లేకుండా ప్రేమగా  ఉంటారు.


Share

Related posts

సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలు ఇవే !!

Sree matha

ఆగస్టు 17 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Today Horoscope: ఏప్రిల్ 27 – చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma