NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: ఫ్యామిలీ ఎపిసోడ్.. డాక్టర్ గా వచ్చి పెద్ద కొడుకు శివాజీకి ఊహించని షాక్ ఇచ్చాడు..!!

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మంగళవారం నుండి ఫ్యామిలీ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమోలో శివాజీ పెద్దకొడుకు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. నేరుగా హౌస్ లోకి రాకుండా శివాజీకి చెయ్యి ఫ్రాక్చర్ కావడంతో డాక్టర్ గా అతని పెద్ద కొడుకుని.. బిగ్ బాస్ లోకి పంపించారు. ఆ తర్వాత బిగ్ బాస్ శివాజీని డాక్టర్ నీ కలవమని ప్రకటించడం జరుగుద్ది.

Family episode He came as a doctor and gave an unexpected shock to the eldest son Shivaji

దీంతో మెడికల్ రూమ్ లోకి శివాజీ వెళ్లగా.. అతని పెద్ద కొడుకు ముఖానికి మాస్క్ కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుని.. డాక్టర్ గా.. శివాజీ యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. శివాజీ అసలు తన పెద్ద కొడుకుని డాక్టర్ రూపంలో గుర్తుపట్టలేకపోయాడు. ఆ తర్వాత మెడికల్ రూమ్ నుండి శివాజీ వెళ్ళిపోతుండగా కొడుకు నాన్న అని పిలవటంతో పాటు మాస్క్ మరియు కళ్ళజోడు తీయడంతో ఒక్కసారిగా కొడుకుని చూసి శివాజీ భావోద్వేగానికి గురై ఏడవటం జరిగింది. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చి అందరికీ తన కొడుకుని పరిచయం చేయడం జరిగింది. ఈ క్రమంలో భోలె తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేలాగా ఉన్నారు.

Family episode He came as a doctor and gave an unexpected shock to the eldest son Shivaji

శివాజీ అన్నని బయటికి పంపించి కొడుకుతో గేమ్ ఆడిద్దామంటే నేను తట్టుకోలేను బాబు అంటూ శివాజీ కొడుకు దండం పెట్టేసాడు. ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా శివాజీ పెద్దకొడుకు ప్రోమో చాలా భావోద్వేగ కరంగా ఉంది. శివాజీ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత అర్జున్ యొక్క భార్య అనంతరం అశ్విని యొక్క తల్లి…హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు లీక్ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఫ్యామిలీ ఎపిసోడ్ స్టార్ట్ కావడంతో బిగ్ బాస్ ఆడియన్స్..కి షో పట్ల ఆసక్తి మరింతగా పెరిగింది.


Share

Related posts

Nuvvu Nenu Prema: అరవింద మనసులో అనుమానాలు కలిగించిన కృష్ణ.. విక్కి, పద్మావతిల పెళ్లి బంధం ముగిసినట్లేనా..?

bharani jella

Pawan Kalyan: అక్టోబర్ లో సినిమా షూటింగ్ ల కోసం విదేశాలకు వెళ్తున్న పవన్ కళ్యాణ్..!!

sekhar

`బింబిసార` డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ హీరోతోనేనా..?

kavya N